పవన్ కళ్యాణ్ పార్టీపై కామెంట్ చేసిన ఎన్టీఆర్

0Jr-NTR-on-Pawan-Kalyanజూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో రాజకీయాలకు దూరంగానే ఉంటున్నాడు. 2009 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున.. అన్న ఎన్టీఆర్ మాదిరిగానే ప్రచారం చేసి ఆకట్టుకున్న జూనియర్.. ఈ మధ్య కాలంలో మాత్రం పాలిటిక్స్ దూరంగా ఉంటూ.. సినిమాలపై శ్రద్ధ పెంచుతూ.. తన స్థాయిని మరింతగా పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు.

అయితే.. ప్రస్తుతం యంగ్ టైగర్ నటించిన జై లవ కుశ మూవీ రిలీజ్ సందర్భంగా రకరకాల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తోంది. వీటిలో పవన్ కళ్యాణ్ నడుపుతున్న జనసేన పార్టీపై కూడా రియాక్ట్ కావాల్సి వచ్చింది. పవన్ ప్రారంభించిన జనసేనపై మీ అభిప్రాయం ఏంటి.. ఆ పార్టీ ప్రజలకు ఎలాంటి సాయం చేస్తుందని మీరు భావిస్తున్నారు.. ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఒకట్రెండు సార్లు సమాధానం చెప్పకుండా డిప్లమాటిక్ ఆన్సర్స్ తో తప్పించుకున్నా.. చివరకు ఈ క్వశ్చన్ కు నేరుగా సమాధానం ఇవ్వక తప్పలేదు ఎన్టీఆర్ కు.

“నాకు ఏ పార్టీ పైనా ఇదీ అని చెప్పేలా నిశ్చితమైన అభిప్రాయాలు ఏ మాత్రం లేవు. అయితే ఒక భారతీయుడిగా.. ఓ పార్టీ అయినా జనాలకు మేలు చేసేలా ఉండాలని నేను కోరుకుంటాను” అంటూ పార్టీ పేర్లు వాడకుండానే తన అభిప్రాయం చెప్పాడు ఎన్టీఆర్. యంగ్ టైగర్ మాటల్లో ఎక్కడా ఎవరిపైనా వ్యతిరేకత.. వ్యంగ్యం కనిపించకపోవడాన్ని.. చాలామంది పాయింట్ చేసి చూపిస్తున్నారు.