కొడుకు చేసిన పనికి, బన్నీ షాక్

0Allu-Arjun-sonబన్నీ తాజా సినిమా ‘డీజే దువ్వాడ జగన్నాథం’ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాటలు ఆదివారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను అల్లు అరవింద్‌ మనవడు, బన్నీ కొడుకు అయాన్‌ , ‘దిల్‌’ రాజు మనవడు ఆరాన్ష్‌ కలిసి విడుదల చేశారు.

అట్టహాసంగా జరిగిన ఈ పాటల వేడుకలో ఓ ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ఈ వేడుకలో అయాన్‌ జనాలను చూసి ఇచ్చిన ఓ పోజు తల్లిదండ్రులు అల్లు అర్జున్‌-స్నేహరెడ్డిలను ఆశ్చర్యంలో ముంచెత్తితే.. అక్కడే ఉన్న తాత అల్లు అరవింద్‌ను పొట్టచెక్కలయ్యేలా నవ్వించేసింది. ఇంతకూ బుజ్జీ అయాన్‌ ఏం చేశాడంటే.. ఆడియో వేడుకకు వచ్చిన అభిమానులు చూసి.. ఓ చిన్నపాటి రాజకీయ నాయకుడి రీతిలో అభివాదం చేశాడు. చూడటానికి ఎంతో క్యూట్‌గా ఉన్న ఈ ఫొటోను బన్నీ ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. కొడుకు జనాలకు అభివాదం చేస్తుంటే విస్మయంగా చూస్తూ ఉండిపోయిన బన్నీ.. అవును అయాన్‌ తీరు చూసి నేనూ ఆశ్చర్యపోయానంటూ పేర్కొన్నాడు.