వైట్ల ఆమె బెడ్ రూంలో పడుకునేవాడట!

0

శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్న శ్రీను వైట్ల ఈ చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకుని మరీ తెరకెక్కించాడు. రవితేజకు కూడా ఈ చిత్రం చాలా కీలకం. మైత్రి మూవీస్ వారు నిర్మించిన ఈ చిత్రంలోని ఎక్కువ శాతం షూటింగ్ అమెరికాలో జరిగింది. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ అక్కడే జరిపినట్లుగా ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కొన్ని సీన్స్ ను జెన్నీఫర్ లోపేజ్ కు చెందిన ఇంట్లో చిత్రీకరించినట్లుగా ప్రచారం చేస్తున్నారు.

చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నట్లుగా అది జెన్నీఫర్ లేపేజ్ ఇల్లే కాని – ప్రస్తుతం మాత్రం ఆమె ఆధీనంలో లేదట. మల్లారెడ్డి అనే తెలుగు ఎన్నారై బిజినెస్ మన్ కొనుగోలు చేశాడట. అయినా కూడా ఇప్పటికి ఆ ఇల్లును జెన్నీఫర్ లోపేజ్ ఇల్లుగానే పిలుస్తారట. శ్రీనువైట్ల ఆ ఇంట్లో షూటింగ్ గురించి మాట్లాడుతూ.. తాను అనుకున్న సీన్స్ కు ఆ ఇల్లు సరిగా సరిపోతుంది. అందుకే ఆ ఇల్లును ఎంపిక చేయడం జరిగింది. ఆ ఇంట్లో షూటింగ్ సమయంలో చాలా మంచి అనుభూతిని పొందాము అన్నాడు.

షూటింగ్ జరిగినన్ని రోజులు కూడా తాను జెన్నీఫర్ గతంలో నిద్రించిన బెడ్ రూంలోనే నిద్ర పోయేవాడిని – ఆ బెడ్ రూంలో మల్లారెడ్డి గారు కూడా ఎప్పుడు పడుకోలేదట అంటూ శ్రీనువైట్ల చెప్పుకొచ్చాడు. సినిమా పబ్లిసిటీ కోసం ఎన్నో చెబుతూ ఉంటారు. కాని ఇలా ఆమె బెడ్ రూంలో పడుకున్నాను – నేను మాత్రమే ఆ బెడ్ రూం ను వాడాను అని చెప్పడం ఏంటో ఆయనకే తెలియాలి.

వచ్చే వారం విడుదల కాబోతున్న అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం ఫలితం పై సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. శ్రీనువైట్ల ఈ చిత్రం సక్సెస్ అయితేనే ముందు ముందు ఆఫర్లు దక్కించుకునే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
Please Read Disclaimer