దీపిక పదుకోన్ హాట్ కామెంట్స్

0deepika-padukone-interviewబాలీవుడ్ బ్యూటీ దీపిక్ పదుకోన్ ‘XXX-రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ అనే సినిమా ద్వారా హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ హాలీవుడ్ స్టార్ విన్ డీజెల్‌తో ఈ చిత్రంలో రొమాన్స్ చేసింది దీపిక.

తొలిసారి హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా దీపికకు వరల్డ్ ఫేమస్ టాక్ షో ‘ది ఎల్లెన్ డిజెనెరస్ షో’ లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది. ఈ టాక్‌లో దీపిక మాట్లాడుతూ…. తనకు విన్ డీజెల్ మీద చాలా క్రష్(కోరిక) ఉందని, ఆతని ద్వారా పిల్లలను కూడా కన్నాను అంటూ సంచలన ప్రకటన చేసింది.

క్రష్ ఓకే కానీ… ఇంతకీ దీపిక గర్భవతి ఎప్పుడయింది? పిల్లలను ఎప్పుడు కనింది అని డౌట్ పడుతున్నారా…? ఆ విషయానికే వస్తున్నాం. ఇదంతా రియాల్టీ కాదు, అలా అని సినిమాలోనూ కాదు. దీపిక మైండ్‌లో ఇవన్నీ జరిగిపోయాయట. ఎల్లెన్ డిజెనరస్ అడిగిన ఓ ప్రశ్నకు దీపిక ఈ విధంగా సమాధానం ఇచ్చింది.

సినిమాలో మీ మధ్య రొమాన్స్ బాగా పండింది. మీ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే ప్రచారం జరుగుతోంది. నిజమేనా? అనే ప్రశ్నకు దీపిక పై విధంగా స్పందించింది. ‘నిప్పు లేకుండా పొగరాదు. అది వాస్తవమే. కానీ అదంతా నా మైండ్ లో జరిగిపోయింది. మా మధ్య అమేజింగ్ కెమిస్ట్రీ ఉంది, ఇద్దరూం కలిసి సహజీవనం చేసాం, మా ఇద్దరికీ అమేజింగ్ బేబీస్ పుట్టారు.ఇదంతా నా మైండ్(ఊహల్లో) జరిగిపోయాయి అని దీపిక తెలిపారు.

‘XXX-రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ సినిమా మొదలయ్యే చివరి వరకు ఈ సినిమాలో నాకు పాత్ర ఉందనే విషయం తెలియదు. వాస్తవానికి నన్ను రెండు మూడు సంవత్సరాల ముందు ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’ కోసం ఆడియషన్ చేసారు. కొన్ని కారణాలతో అది వర్కౌట్ కాలేదు. తర్వాత వారే నన్ను గుర్తు పెట్టుకుని ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు అని దీపిక తెలిపారు.

loading...