హీరో ను ‘అది’ చూపించామన్నాడట!

0ఏదీ ఊరికే రాదు. కొంతమందికి లక్కుకొద్దీ వస్తుంది కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా నానా తంటాలు పడాల్సి ఉంటుంది. మనకున్న సగం స్టార్ కిడ్స్ తమ కెరీర్లో నిలదొక్కుకునేందుకు ఎన్ని కష్టాలు పడుతున్నారో అందరం చూస్తున్నాం కదా. బాలీవుడ్ సంగతే తీసుకుంటే బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చే హీరోయిన్లే కాదు హీరోలకు కూడా నరకం కనిపిస్తుంది.

చాలామంది హీరోయిన్లు ఓపెన్ గా వాళ్ళకెదురైన ఇబ్బందుల గురించి చెప్పారు. క్యాస్టింగ్ కౌచ్ ఉందని గట్టిగా నిర్ధారించారు. ఇక హీరోలకు కూడా ఈ బాధలు బాలీవుడ్ లో ఎక్కువే. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా తెలుసు కదా. టాలెంటెడ్ ఆర్టిస్ట్… మంచి సింగర్ కూడా. “సాడి గలీ ఆజా” (నౌటంకీ సాలా సినిమా).. మరో ప్రైవేటు సింగల్ “ఇక్ వారి హా కేహ్ దే” లాంటి సాంగ్స్ తో సంగీత ప్రియులను అలరించాడు. ఇక డిఫరెంట్ కంటెంట్ ఉండే ‘విక్కీ డోనార్’.. ‘శుభ్ మంగళ్ సావ్ ధాన్’ లాంటి సినిమాలు కూడా చేసి ప్రేక్షకులను మెప్పించాడు. పాపం ఈ ఆయుష్మాన్ ఖురానాకు కూడా తన కెరీర్ కొత్తలో ఇబ్బందులు తప్పలేదట.

ఒక సినిమా ఆడిషన్ కోసం వెళ్తే అక్కడ గే క్యాస్టింగ్ డైరెక్టర్ తగిలాడట. అతను “నేను నీ పురుషాంగం చూడాలనుకుంటున్నాను.. నిన్ను ఫీల్ అవ్వాలని అనుకుంటున్నాను” అని అశగా చెప్పాడట. అది విన్న ఆయుష్మాన్ తన మనసులో “క్యా బాత్ కర్ రహే హో యార్? ఆర్ యూ సీరియస్”(ఏం మాట్లాడుతున్నావ్ రా నాయనా..నిజంగానేనా?) అనుకుని ‘నో’ అని బయటకు చెప్పాడట. డిఫరెంట్ కంటెంట్ సినిమాలు – మెలోడీ పాటలే కాదు మనోడికి ఇలాంటి ఫసక్ ఎక్స్ పీరియెన్స్ లు ఉన్నాయన్నమాట. ఢక్కామొక్కీలు తిని హీరో అయ్యాడు!!