పోలీసుల సూచనల మేరకు కౌన్సిలింగ్‌కు హాజరవుతా: ప్రదీప్

0తాను ఎక్కడికీ పారిపోలేదని టీవీ వ్యాఖ్యాత ప్రదీప్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. ‘నాపై అనేక అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయి. ఎవరూ నమ్మవద్దు. ముందస్తుగా అంగీకరించిన కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్నా. పోలీసుల సూచనల మేరకు కౌన్సిలింగ్‌కు హాజరవుతా. డిసెంబర్‌ 31 నాటి ఘటన విచారకరం. నేను డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిబంధనలు ఉల్లంఘించిన మాట వాస్తవమే. తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నా. నేను చేసిన తప్పు మరెవరూ చేయకూడదు. ’ అని పేర్కొంటూ క్లిప్‌ను విడుదల చేశారు.