మహేష్ సీరియస్.. ఇక్కడ ఎవరి పని వారే చేయాలి

0

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక నిన్న గ్రాండ్ గా హైదరాబాద్ లో జరిగింది. ఈ చిత్రం మహేష్ బాబుకు 25వ సినిమా అవ్వడం వల్ల ఈ వేడుకను భారీ ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకలో హీరోయిన్ పూజా హెగ్డే మాట్లాడుతూ మహేష్ బాబును ఆకాశానికి ఎత్తేసింది. మహేష్ తో వర్క్ చేయడం తన అదృష్టంగా చెప్పుకొచ్చింది. ఈ సమయంలోనే పూజా చిన్న సలహాను మహేష్ బాబుకు ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఆ సలహాను కాస్త సీరియస్ మహేష్ తిరష్కరించాడు.

ప్రీ రిలీజ్ వేడుకలో పూజా హెగ్డే మాట్లాడుతూ.. 25 సినిమాలు చేసిన అనుభవం ఉన్న మహేష్ బాబు గారు ఒక మంచి దర్శకుడు కాగలరు ఆయనలో మంచి దర్శకుడు ఉన్నాడు. భవిష్యత్తులో ఆయన దర్శకుడు అవుతాడో లేదో నాకు తెలియదు కాని ఆయన సన్నివేశాలను చర్చించే విధానం మరియు చూసే విధానం చాల విభిన్నంగా కొత్తగా ఉంటుంది. అందుకే ఆయనలో దర్శకుడు ఉన్నాడనిపించింది.

పూజా వ్యాఖ్యలపై స్పందించిన మహేష్ బాబు ఇండస్ట్రీలో ఎవరి పనులు వారు చేస్తేనే బాగుంటుందని అన్నాడు. తనకు దర్శకత్వంపై ఏమాత్రం ఆసక్తి లేదని తేల్చి చెప్పాడు. పూజా హెగ్డే మాటలతో మహేష్ బాబు డైరెక్షన్ లో వేలు పెడతాడనే విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే మహేష్ బాబు ఇలా సీరియస్ గా స్పందించి ఉంటాడు. ఎంతో మంది హీరోలు దర్శకులుగా ప్రయత్నాలు చేశారు. కాని హీరో మహేష్ బాబు మాత్రం తాను ఖచ్చితంగా దర్శకత్వం చేయాలని భావించడం లేదని క్లారిటీ ఇచ్చాడు. మరి మహేష్ భవిష్యత్తులో ఏమైనా తన నిర్ణయాన్ని మార్చుకుంటాడేమో చూడాలి.
Please Read Disclaimer