అవకాశాల కోసం సెక్స్ చేయాలా?

0ileanaఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే.. ఒక మీడియాలో ఏదైనా ఒక న్యూస్ వస్తే చాలు.. అది నిజామా కాదా అని వెరిఫై చేయకుండా తక్కినవారందరూ గుడ్డిగా దాన్నే ఫాలో అవుతున్నారు. ఇప్పుడు గోవా బ్యూటి ఇలియానా గురించి వచ్చిన అలాంటి ఒక న్యూస్ అందరినీ కలవరపెట్టేస్తోంది. నిజంగానే ఆమె అటువంటి కామెంట్లు చేసిందా అంటూ ఆమె అభిమానులు వాపోతున్నారు.

”నేను అవకాశాల కోసం దిగజారను. కొంతమంది బెడ్రూమ్స్ లో చేరి ఏం చేయాలో అది చేస్తుంటారు. కాని అవకాశాల కోసం నాకు అలా సెక్స్ భానిస అవ్వాల్సిన అవసరం లేదు. వచ్చిన సినిమాలే చేస్తాను. రానివి చేయను. చీప్ పాత్రలు వేయను” అంటూ ఇలియానా చెప్పిందని ఒక ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. అయితే గత కొద్ది కాలంగా బాద్షాహో సినిమా షూటింగులో బిజీగా ఉన్న ఇలియానా.. నిన్నే ఆ సినిమా షూటింగ్ ముగించుకుని ఆనందంగా ఇండియా వస్తున్నట్లు తెలిపింది. ఈ తరుణంలో అసలు ఇలియానా ఇలాంటి స్టేట్మెంట్లు ఎప్పుడు ఇచ్చిందబ్బా అనే సందేహం ఎవరికైనా వస్తుంది మరి.

నిజానికి ఓవర్ ఎక్సపెక్టేషన్లతో బాలీవుడ్ లో అడుగుపెట్టి తన కెరియర్ నాశనం చేసుకున్న ఇలియానా.. అసలు ఇటువంటి కామెంట్లు చేస్తుందంటారా? లేకపోతే ఎలాగో బికినీల్లో రచ్చ రచ్చ చేస్తూ అవకాశాల కోసం దీనంగా ఎదురుచూస్తోంది కాబట్టి ఇటువంటి కామెంట్లు ఆమెకు ఆపాదిస్తున్నారా?