సీమంతంలో కంత్రీ!

0

Ileana-At-Neha-Dhupia-baby-shower-Functionఇల్లియానా.. చిల్లియానా.. అంటూ ఓ సినీ కవి లిరిక్ రాశాడు. ఎందుకో ఇదిగో ఈ ఫోటోలో నవ్వులు చిందిస్తున్న ఇలియానాను చూస్తే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అంతందంగా నవ్వాక కర్రాళ్లు పడిపోకుండా ఉంటారా? కనిపించీ కనిపించనట్టు.. ముసిముసిగా నవ్వేస్తూ ఇలా జూలీ నేహా ధూపియా సీమంతం ఈవెంట్ లో సైలెంట్ కిల్లర్లా దర్శనమిచ్చింది.

ఓవైపు గెస్టులంతా సీమంతం హడావుడిలో మునిగి ఉంటే తాను మాత్రం జూలీతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది ఇలియానా. అన్నట్టు ఈ ఈవెంట్ కి ఫోటోగ్రాఫర్ బోయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ వచ్చాడా? వచ్చి ఉంటే ఫోటో షూట్ పెట్టేవాడే. అందుకే రాలేదేమో!

అది సరే.. ఇలియానా ప్రస్తుతం కెరీర్ పరంగా ఎలా ఉంది? అంటే సినిమాలతో కంటే షికార్లతోనే బిజీగా ఉందేమో అనిపిస్తోంది. అప్పట్లో ఫిజీ దీవుల్లో బ్రాండ్ అంబాసిడర్ గా ఫోటోషూట్లతో అదరగొట్టేసింది. టాలీవుడ్ లోకి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తోంది. కొలీగ్స్ శ్రీనువైట్ల – రవితేజ కాంబినేషన్ లో `అమర్ అక్బర్ ఆంటోని` చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. మొన్ననే పుట్టినరోజు వేళ శ్రీనూకి శుభాకాంక్షలు తెలిపింది.
Please Read Disclaimer