బాద్షాహో : నగ్నంగా ఇలియానా, సన్నీ మసాలా…

0


baadshaho-official-teaserఅజయ్ దేవగన్, ఇలియానా, ఇమ్రాన్ హష్మి, ఇషా గుప్తా, విద్యుత్ ఝామ్ వాల్, సంజయ్ మిశ్రా ప్రధాన పాత్రధారులుగా బాలీవుడ్లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘బాద్షాహో’. 1975 ఇండియా ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ఓ సంఘటనను బేస్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతోంది.

తాజాగా ఈ చిత్రానికి సంబందించిన టీజర్ రిలీజైంది. దాదాపు 2 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్లో సినిమా ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మిలన్ లూథ్రియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రజత్ అరోరా కథ అందించారు.

సినిమాలోని ఓ సీన్లో ఇలియానా నగ్నంగా నటించింది. హీరో అజయ్ దేవగన్‌తో రొమాన్స్ చేసే ఈ సీన్లో ఇలియానా ఇంత సాహసోపేతంగా ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నటిస్తుందని ఎవరూ ఊహించలేదు.

బాలీవుడ్ కిస్సుల కింగ్‌గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మి ఈ చిత్రంలో సన్నీ లియోన్‌తో కలిసి రొమాంటిక్ మసాలా దట్టించిన సీన్లలో నటించారు. దీన్ని బట్టి సినిమాలో యాక్షన్ తో పాటు రొమాన్స్ కూడా ఓ రేంజిలో ఉంటుందని స్పష్టమవుతోంది.

‘బాద్షాహో’ చిత్రం 6 గురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఈ ఆరు పాత్రల్లో అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మి, ఇలియానా, విధ్యుత్ జామ్‌వాల్, ఇషా గుప్తా, సంజయ్ మిశ్రా నటిస్తున్నారు.

1975 ఎమర్జెన్సీ కాలంనాటి సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఆ సమయంలో ఓ ట్రక్కులో కోట్లాది రూపాయల విలువైన బంగారం తలించారని, 600 కిలో మీటర్లు 96 గంటపాటు జరిగే ఈ ప్రాయాణంలో ఏం జరిగింది? ఈ ఆరుగురు వ్యక్తులకు సంబంధం ఏమిటనే కాన్సెప్టుతో సినిమా తెరకెక్కుతోంది.

సెప్టెంబర్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అంకిత్ తివారీ సంగీతం అందిస్తున్నారు. ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులకు అద్దంపట్టేలా సినిమా ఉంటుందని అంటున్నారు.