అజయ్ దేవగన్‌తో న్యూడ్ సీన్.. ఇలియానా ఐడియా

0ileana-d-cruz-about-baadshaసౌత్ సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పి బాలీవుడ్లో సెటిలైన హీరోయిన్ ఇలియానా…. అక్కడ పెద్ద స్టార్ అయ్యేందుకు చాలా కష్టపడుతోంది. కొన్ని విషయాల్లో తానే స్వయంగా చొరవ తీసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

ఇలియానా త్వరలో ‘బాద్‌షాహో’ అనే బాలీవుడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ఆమె అజయ్ దేవగన్ ప్రియురాలిగా, రాయల్ లేడీ పాత్రలో కనిపించబోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆమె ఈ చిత్రంలో కొన్ని బోల్డ్ సీన్లు చేసింది.

సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఓ సాంగులో ఇలియానా జాకెట్ విప్పేసి న్యూడ్‌గా కనిపించింది. ఎన్నడూ లేని విధంగా ఇలియానా ఇంత బోల్డ్‌గా నటించడం హాట్ టాపిక్ అయింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇలియాన ఈ సీన్ గురించి మాట్లాడారు. ఆ పాట చివర్లో జాకెట్ విప్పేసి న్యూడ్‌గా కనిపించాలనే ఐడియా తనదే అని, దర్శకుడికి కూడా నేను చెప్పింది నచ్చడంతో ఓకే చెప్పాడని ఇలియానా తెలిపారు.

న్యూడ్ సీన్లు చేయాలంటే అందులో నటించే నటీనటుల మధ్య ఒకరిపై ఒకరికి నమ్మకం, రెప్పెక్ట్ ఉండాలి. అజయ్ దేవగన్‌కు, తనకు మధ్య అలాంటిది ఉంది కాబట్టే ఆ న్యూడ్ సీన్ చేయగలిగాను అంటూ ఇలియానా చెప్పుకొచ్చారు.

సెట్లో ఆ సీన్ అయిపోగానే….. వేరొకరు నాకు వేసుకోవడానికి బట్టలు తెచ్చి ఇచ్చే వరకు అతడే నాకు కవచంలా ఉన్నారు. అజయ్ ఒక జంటిల్‌మెన్, అందుకే అతడితో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ సీన్ చేయగలిగాను అని ఇలియానా….. ఈ విషయాలన్నీ చాలా బోల్డ్‌గా చెప్పేసింది.