అబ్బాయి కలర్ తో పనేంటన్న ఇలియానా

0నేను అతని హృదయాన్ని చూసే ప్రేమించా. ఇక అతను ఏ కలర్లో ఉంటే నాకేంటి? ఏ జాతి అయితే నాకేంటి? అంటోంది ఇలియానా. కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీ బోన్ ప్రేమలో ఉంది ఇలియానా. వీళ్లిద్దరూ కలిసి ఇండియాలో కొన్నాళ్లపాటు సహజీవనం చేశారు. పనులవల్ల ఇప్పుడు ఆండ్రూ ఆస్ట్రేలియాలో గడుపుతున్నాడు. కానీ ఎప్పుడు సమయం దొరికినా ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. ఆండ్రూపై తనకెంత ప్రేమ ఉందో మరోసారి చెప్పకనే చెప్పింది ఇలియానా.

ఇటీవలే ఆండ్రూ పుట్టినరోజు సందర్భంగా అతని గురించి ఇన్ స్టగ్రామ్ లో గొప్పగా రాసింది. అలాగే అక్కడే అభిమానులతో ఛాట్ కూడా చేసింది. విదేశీయుడిని ఎందుకు ప్రేమించావని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకి ఇలియానా చెప్పిన సమాధానం ఆండ్రూని ఆమె ఎంతగా ప్రేమిస్తుందో స్పష్టమైంది. ఆండ్రూ హృదయాన్ని చూసే ప్రేమించానని – దాని ప్రేమలోనే నేను ఉన్నానని స్పష్టం చేసింది ఇలియానా. ఆమె బంధం గురించి బాలీవుడ్ లో ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. ఆండ్రూని ఇలియానా పెళ్లి చేసుకొందని – అందుకే ఆమె తరచుగా హబ్బీ అని సంబోధిస్తుందని చెప్పుకొంటున్నారు. అయితే ఇలియానా మాత్రం ఆ విషయాన్ని దాటవేస్తుంది. నా బంధం గురించి మరీ ఎక్కువగా బయట మాట్లాడటం నాకు ఇష్టం ఉండదని తప్పించుకొనే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో `అమర్ అక్బర్ ఆంటోనీ` చిత్రం చేస్తోంది. సుదీర్ఘకాలం తర్వాత ఇలియానా తెలుగులో చేస్తున్న చిత్రమిది.