ఫిజీ బీచ్ లో ఇలియానా బికినీ తుఫాన్!

0ఫిజీ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైనప్పటి నుంచి ఇలియానా తనలో తాను లేదు. తన మనసంతా ఫిజీనే. ఆ సంగతిని ఈ అమ్మడు ప్రమోట్ చేస్తున్న విధానాన్ని బట్టి ఇట్టే చెప్పేయొచ్చు. భారతదేశానికి లేదా తనకు జన్మనిచ్చిన గోవాకి సైతం ఇలియానా ఏనాడూ ఏదీ చేసిందేం లేదు. కానీ ఇప్పుడు దేశం కాని దేశం – అది కూడా ఓ ద్వీపానికి టూరిజం అభివృద్ధి చెందేలా చేయడం కోసం ఎంతగానో తపిస్తోంది. ఈ తపన వెనక భారీ డీల్ సెట్ చేసుకున్న మ్యాటర్ అలా ఉంచితే..

అసలు ఫిజీ అంటే ఇలియానా …. ఇలియానా అంటే ఫిజీ! అన్న చందంగా రూపొందించిన ఈ వీడియోని తప్పక చూడాల్సిందే. `ఫిజీ విత్ ఇలియానా డి.క్రజ్` పేరుతో తాజాగా ఓ వీడియోని టైమ్స్ నవ్ టెలీకాస్ట్ చేసింది. ఇందులో ఇలియానా ఫిజీ గురించి తన గొంతుతోనే వినిపించింది. హస్కీ వాయిస్ తో మైమరిపించే క్రిస్ పీ పదజాలంతో ఇల్లూ ఫిజీ అందచందాల్ని వర్ణించింది. ఆ వీడియో మిడిల్ లో ఊహించని ఓ ఛమక్కు. ఉన్నట్టుండి ఇలియానా బికినీలో తళుక్కున మెరిసింది.

గోవా బ్యూటీ ప్రచారం ఫిజీకి ఓ రేంజులో కలిసొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. విదేశం కోసం అంత చేసిన ఈ భామ గోవా అందాలకు బ్రాండింగ్ చేస్తే ఇంకా బావుంటుందేమో! లేదూ గోవా – ఫిజీల్ని తలపించే విశాఖ బీచ్లకు అయినా ఈ అమ్మడు బ్రాండ్ అంబాసిడర్ గా పూనుకుని ప్రచారం చేస్తే ఏపీకి టూరిజం ద్వారా రెవెన్యూ పెరుగుతుందేమో? తనకోసం తెలుగు ప్రజలు ఎంతో చేశారు. అసాధారణ స్టార్ డమ్ నిచ్చారు. ఆమాత్రం చేయలేదంటారా?