తెలుగోళ్లు చేసిన పనికి ఇలియానా కన్నీళ్లు

0ఇలియానా.. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్.. మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ – ఎన్టీఆర్ లాంటి అగ్రహీరోలందరితో నటించి నంబర్ 1 హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కానీ ఎప్పుడైతే బాలీవుడ్ బాట పట్టిందో అప్పటినుంచే ఆమె పతనం మొదలైంది. మొదట్లో కొన్ని బాలీవుడ్ సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చాయి. కొన్ని హిట్స్ అయినా మెజార్టీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమెను అక్కడ పట్టించుకోవడం మానేశారు. కోరివెళ్లిన బాలీవుడ్ వదిలేయడం.. టాలీవుడ్ నుంచి అవకాశాలు దూరమవడంతో డిప్రెషన్ లోకి వెళ్లింది.ఫిజి లాంటి దేశాలకు వెళ్లి బీచ్ లో సేదతీరుతూ గడిపేసింది.

కానీ అనుకోని అవకాశం మళ్లీ టాలీవుడ్ నుంచే వచ్చింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘అమర్ అక్బర్ అంటోనీ’ అనే సినిమా తెరకెక్కుతోంది. చాలా ఆలోచించాక ఇలియానాను హీరోయిన్ గా ఎంపిక చేశారట.. బాలీవుడ్ కు వెళ్లిన ఈ భామ రెమ్యూనరేషన్ ఎక్కువ అడుగుతుందని ఆశించారు. కానీ అవకాశాలు లేకపోవడంతో పెద్దగా డిమాండ్ చేయలేదట.. తొలిరోజు షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ రాగానే ఆమెకు అదిరిపోయే రీతిలో చిత్రం యూనిట్ స్వాగతసత్కారాలు ఏర్పాటు చేసింది. ఒక యువరాణిలా ఆమెను చూసుకుంది. మంచి హోటల్ రూము – ఉండడానికి వసతులు సమకూర్చిందట..

బాలీవుడ్ లోకి వెళ్లి వచ్చి టాలీవుడ్ ను వదిలేసిన ఇలియానా మళ్లీ చానాళ్ల తర్వాత తెలుగులో నటిస్తుండడంతో తనకు ఆదరణ ఉంటుందో ఉండదో అని మొదట భయపడిందట.. కానీ చిత్రం యూనిట్ నెత్తిన పెట్టుకోవడంతో ఆమె కళ్ల వెంట జలజలా కన్నీళ్లు రాలాయి. తనను అపూర్వంగా ఆదరించిన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చిత్రం యూనిట్ కు ఆమెకు కృతజ్ఞతలు తెలిపింది. ఇలా బాలీవుడ్ లో పట్టించుకోని హీరోయిన్ ను తెలుగునాట మరోసారి మన వారు అక్కున చేర్చుకోవడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయని తెలిసింది.