సముద్రపు అడుగున బికినీలో సాగర కన్య

0హాట్ బ్యూటీ ఇలియానా ను ఎవరు మర్చిపోయినా టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం అస్సలు మరచిపోలేరు. ఆమె ఎన్ని భాషల్లో నటించినా కూడా ఇక్కడ వచ్చినంత క్రేజ్ మరెక్కడా రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ వైపు ఎక్కువగా ఉన్నా కూడా అమ్మడు సోషల్ మీడియాలో కనిపిస్తే లైక్ కొట్టేది టి టౌన్ ఫాలోవర్సే. ఇకపోతే ఈ మధ్య గోవా బ్యూటీ ఇండియన్ టూరిజం కి ప్రచారకర్తగా బాధ్యతలను తీసుకున్న సంగతి తెలిసిందే.

అందులో భాగంగా ఐలాండ్ నగరాల అందాలను తన అందంతో జోడించి కొత్త తరహా ప్రచారాలను కలిగిస్తోంది. ఫిజి ఐలాండ్ కూడా వెళ్లిన ఇల్లి అక్కడి నదుల అందాలను పరిచయం చేసింది. ఆ దీవి లోని నీళ్లలో అనేక రకాలా ఫిష్ లు ఉన్నాయని తనకు ఇష్టమైన నీమో కజిన్ ను వెతికే పనిలో పడ్డాను అని ఒక ఫొటో పోస్ట్ చేసింది. ఇలియానా బికినిలో ఇచ్చిన ఆ పోజు ఇప్పుడు వైరల్ అవుతోంది. చాలా సెక్సీగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. సముద్రపు అడుగున ఈదుతున్న సాగర కన్యలా ఉందట.

ఫిజి ఐలాండ్ లో దర్శమివ్వడం గోవా బ్యూటీకి ఇది రెండవసారి. ఇంతకుముందు కూడా హాట్ స్టిల్ ఇచ్చి షాకిచ్చింది. ఇక ఇప్పుడు కూడా అదే రేంజ్ కనిపించింది. ఇక ఏడాది బాలీవుడ్ లో రెయిడ్ సినిమాతో వచ్చిన అమ్మడు నెక్స్ట్ టాలీవుడ్ లో దర్శనమివ్వనుంది. రవితేజ అమర్ అక్బర్ అంథోని సినిమాలో మెయిన్ లీడ్ లో కనిపించనుంది.