ఫిజీ దీవుల్లో ఇలియానా భూకంపం

0హరికేన్… సునామీ.. తుఫాన్.. పేరు ఏదైనా అది భీభత్సానికి సంబంధించినది. సునామీతో పాటే భూకంపం వస్తుంది. ఇది అంతకంటే ప్రమాదకరమైనది. దీనిని ఇలియానా ఎర్త్‌కేక్ అని పిలుస్తున్నారు!? ఇంతకీ మ్యాటరేంటో.. అంటే.. డీప్‌గా డీటెయిల్స్‌లోకి వెళ్లాల్సిందే..

ఫిజీ దీవి అందాల గురించి వర్ణించాలంటే పుస్తకమే రాయాలి. ఇదిగో ఈ వీడియో చూశాక మీరే ఆ మాట అంటారు. భూమ్మీద మరో పండోరా గ్రహం అంత అందంగా ఈ దీవి ఉందంటే అతిశయోక్తి కాదు. ఎటు చూసినా అందమైన గ్రీనరీ అడవుల్లో గిరిజన సంతతి నివాసం.. మనసుపై ఘాడమైన ముద్ర వేసే బులుగు జిలుగు సముద్రం.. ఇసుకతిన్నెలు .. బీచ్ సొగసులు.. పరదాలు పరుచుకున్న అందాలు… అసలు ఆ వాతావరణమే పూర్తిగా వేరుగా ఉంది. అలాంటి గొప్ప దీవికి ప్రచారం చేసే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? అందుకే సన్నజాజి సోయగం ఇలియానా ఈ ఆఫర్‌ని చటుక్కున పట్టేసింది. ఫిజీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది మొదలు తనదైన శైలిలో ఆ దీవిలో అడుగుపెట్టి అక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేసింది.

సరిగ్గా రెండు నెలల క్రితం ఫిజీ దీవుల్లో ఇలియానాపై యాడ్ (వీడియో) షూట్ జరిగింది. అప్పట్లో బోయ్‌ఫ్రెండ్ నీబోన్ ఫోటోగ్రఫీలో తన అందచందాల ఫోటోల్ని ఇలియానా తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసి వేడి పెంచింది. అప్పుడు ఒక్కో గ్లింప్స్‌ని క్యాచ్ ప్లీజ్ అంటూ అభిమానుల కోసం ఒక్కో ఫోటోని షేర్ చేసింది. అలా ఫిజీకి అప్పుడే బోలెడంత ప్రాచుర్యం తెచ్చేసింది.

ఇప్పుడు ఏకంగా ఇలియానా ఫిజీ ప్రచార ప్రకటన వీడియో రూపంలోనే బయటకు వచ్చింది. ఈ వీడియో ఓ మిరాకిల్ అంటే అతిశయోక్త కాదు. ఇలియానా నిజంగానే పండోరా గ్రహంపై అడుగుపెట్టిందా? అన్నంత అందంగా ఉంది. ఫిజీ సముద్రం షేకయ్యేలా సర్ఫింగ్‌లో చేపపిల్లలా ఈదింది. ఇల్లూ ఏకంగా డీప్ సీ అడుగున చేప పిల్లలతో ఆడుకుంది. అదే దీవిలో స్కైలోకి వెళ్లి విమానంలోంచి జంప్ చేసి స్కై డైవింగ్ చేసింది. అడవుల్లో ఆ పచ్చదనంలో ఆటలాడుకుంది. ఆ అందాలకు ఇల్లూ మంత్రముగ్ధం అయిపోయిన తీరు మైమరిపించింది. మొత్తానికి ఈ వీడియో చూశాక రెండు రకాలుగా ప్రేమలో పడడం ఖాయం. ఇలియానా ప్రేమలో.. ఫిజీ దీవితో ప్రేమలో! ఇలియానా దెబ్బకు ఫిజీలో భూకంపం రావాల్సిందే మరి!