హాటుగా గోవా బ్యూటీ

0

గోవా బ్యూటీ ఇలియానా డీ క్రజ్ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు దాదాపుగా ఉండరు. తెలుగులో టాప్ స్టార్స్ అందరితో నటించిన ఇలియానా తర్వాత బాలీవుడ్ పై ఫోకస్ చేసింది. అక్కడ కూడా ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో రవితేజ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అమర్ అక్బర్ అంటోని’ తో టాలీవుడ్ రీ -ఎంట్రీ ఇచ్చింది. కానీ సినిమా ఫ్లాప్ కావడంతో ఇప్పుడు తెలుగులో కొత్త అవకాశాలు రావడం కష్టమే.

సినిమా ఫ్లాపు కావడంతో పాటుగా ఇలియానా చబ్బీ లుక్స్ కు నెగెటివ్ మార్కులు పడ్డాయి. కానీ ఈ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా లైమ్ లైట్ లో ఎలా ఉండాలో ఈ గోవా బ్యూటీకి తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియదు. అందుకే ఇల్లీ బేబీ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్(ఇల్లీ- అండ్రూ పెళ్ళి ఎప్పుడో అయిపోయిందని అంటున్నారు గానీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు) తాజాగా తన ప్రియురాలి హాట్ ఫోటో పోస్ట్ చేశాడు. అండ్రూ ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అనే సంగతి తెలిసిందే కదా. దీంతో ఫోటో చాలా కళాత్మకంగా ఉంది.

ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్ లో ఇలియానా ఒక ప్రింటెడ్ షర్టు వేసుకుంది. పై బటన్లు రెండు పెట్టుకోకుండా వదిలేసింది. పైగా సైడ్ యాంగిల్ లో ఫోటో తీయడంతో.. ఆమె అందాలన్నీ విందు చేస్తున్నాయి. స్ట్రెయిట్ చేసిన హెయిర్.. ఫేసుకు తగ్గ మేకప్ తో ఒక హాట్ బ్యూటీ లా కనిపించింది. అందరూ ఇల్లీని చబ్బీ.. చబ్బీ అనడంతో ఆండ్రూగారికి మండిందేమో.. బొద్దుగా కనపడకుండా తన నైపుణ్యం అంతా ఫోటో తీసేందుకు వాడాడు.
Please Read Disclaimer