ఇదేంది ఇల్లీ బేబి?

0తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరేలేని పేరు ఇలియనా డిక్రజ్. మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్.. ఎన్టీఆర్..ఇలా అందరూ ఆమెను స్క్రీన్ మీద చూసి ఫ్లాట్ అయినవారే. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రవితేజ సినిమా తో రానుంది. ‘అమర్ అక్బర్ అంటోనీ’ తో తన లక్కును టెస్ట్ చేసుకోబోతోంది. ఇక ఇల్లీ బేబీ సోషల్ మీడియా లో ఫుల్ యాక్టివ్.

ఇన్స్టాగ్రామ్ లో 8.7 మిలియన్ ఫోలోయర్లు ఉన్నారు. వారికోసం ఇంట్రెస్టింగ్ ఫోటోలు తరచుగా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఎలాగూ తన బాయ్ ఫ్రెండ్ అండ్రూ నీబోన్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కాబట్టి వేరే పనులకు పోనివ్వకుండా తన ఫోటోలు తీయమని అదేపనిగా ఎడిపిస్తుందో ఏమో మనకు తెలీదు గానీ ఆ అండ్రూ ఇల్లీ బేబీ కి మంచి మంచి ఫోటోలు తీస్తుంటాడు. కానీ ఎంతపెద్ద ఫోటోగ్రాఫర్ అయినా కొన్ని ఫోటోలు తేడా కొడతాయి కదా. అందుకే రీసెంట్ గా ఇల్లీ బేబీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా రెండు ఫోటోలు పోస్ట్ చేసింది. ఒక ఫోటో సూపర్ గా ఉంది. కౌబాయ్ సినిమాలో ఉండే కత్తి లాంటి బ్యూటీ లా కనిపించింది రెండో ఫోటోలో కూడా గెటప్ అదేగానీ చేతికున్న వాచీ చూసుకుంటూ అదోరకమైన ఎక్స్ ప్రెషన్ పెట్టింది.

రెండిటికీ ఆమె క్యాప్షన్ కూడా ఇచ్చింది. 1. సూపర్ ఫోటో కోసం పోజు. 2. నెవర్ మైండ్. సహజంగా రెండో నెంబర్ ఫోటోల లాంటివి సెలబ్రిటీలు పోస్ట్ చేయరు. ఇల్లీ బేబీ ఎక్స్ ప్రెషన్ వింతగా ఉన్నప్పటికీ నెటిజనులకు మాత్రం ఆ వింత ఎక్స్ ప్రెషన్ భలే నచ్చింది. ఒకరోజులోపే 4.6 లక్షల లైకులు వచ్చాయి. అంతా బాగుంది కానీ ఒక్క విషయం మర్చిపోయాం. ఇల్లీ మళ్ళీ స్లిమ్ముగా మారింది. సెక్సీ నడుమును చూపించింది. నాభిఅందాలను రెండు ఫోటోలలో రంగరించింది. మరి ఇన్స్టాను మన దర్శకేంద్రుల వారు చూస్తారో లేదో..!