సాగర కన్యలా.. ఇలియానా

0


Ileana-Latest-Photo-shootఅసలు గోవా సుందరి ఇలియానా వెకేషన్ కు వెళుతుంది అంటే చాలు.. సోషల్ మీడియా అంతా ఎలర్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఆమె ఎప్పుడు అలాంటి వెకేషన్ కు వెళ్ళినా కూడా.. అక్కడ నుండి బికినీల్లో ఫోటోలు పెట్టేయడం.. లేదంటే రకరకాల విధంగా రచ్చ చేయడం ఈ భామకు అలవాటే. అందుకే ఫ్యాన్స్ కూడా వెకేషన్ వెళ్ళిన ఇలియానా సోషల్ మీడియా ఎకౌంట్ ను చాలా క్లోజుగా ఫాలో అవుతుంటారు.

ఇకపోతే ప్రస్తుతం న్యూజిలాండ్ దగ్గర్లో ఉన్న ఫిజి ఐల్యాండ్స్ కు వెకేషన్ ను వెళ్ళింది ఈ నడుం సుందరి. కాని అందరూ అనుకుంటున్నట్లు కేవలం వెకేషన్ కే వెళ్ళలేదండోయ్. అమ్మడు అక్కడ రోజూ రకరకాల మ్యాగజైన్ల కోసం ఫోటో షూట్లు చేస్తోంది. అవి కూడా ఈమె ప్రియుడు ఆండ్రూ నీబోన్ షూట్ చేస్తున్నాడు. అందుకే తన టీమ్ అంతటితో కలసి అమ్మడు అక్కడికెళ్ళింది. అయితే అప్పుడప్పుడూ మాత్రం తన హోటల్ దగ్గరే ఉన్న బీచులో ఆడుకుంటూ.. ఇలా ఒక ప్యాడ్ పై నిలబడి పడవను ఈదుతున్నట్లు సందడి చేస్తూ.. అర్రే సాగర కన్య సముద్రంలో నుండి బయటకు వచ్చిందా అన్నట్లు అలజడి సృష్టిస్తోంది.