మహేష్ బాబు అంటే ఎవరో నాకు తెలియదు.. ఇలియానా

0Ileana16వ ఏట సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాను. తొలి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాను. ఆ తర్వాత టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో పోకిరి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అసలు అప్పట్లో తనకు మహేశ్‌ అంటే ఎవరో తెలియదు. అసలు సినిమా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికే చాలా కాలం పట్టింది. అలా ఏళ్లు గడుస్తున్న కొద్ది తాను చేసే పనిపై గౌరవం ప్రేమ పెరిగాయని ఇలియానా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లతో ఇలియానా బిజీగా వుంది. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబుతో ఇల్లీ బ్యూటీ మళ్లీ కలిసి నటించే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

ఈ నేపథ్యంలో దక్షిణ ముంబైలో జరిగిన ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఇలియానా మాట్లాడుతూ.. ఎయిర్‌ హోస్టెస్‌ కావాలన్నది తన చిన్ననాటి కలని చెప్పుకొచ్చింది. ఎయిర్ హోస్టెస్ అయితే ఉచితంగా ప్రపంచాన్ని చుట్టేయొచ్చని భావించానని వెల్లడించింది. ఆ తరువాత ఫ్యాషన్ డిజైనింగ్ చెయ్యాలని భావించానని, కాలేజీ రోజుల్లో క్లాసెస్ జరుగుతున్నప్పుడు లాస్ట్ బెంచ్‌లో కూర్చుని డిజైన్లు గీస్తూ కూర్చునేదానినని తెలిపింది.