వాళ్ళు నన్ను ప్రక్కన పెట్టేసారు!

0ileana-latest-picప్రస్తుతం హిందీలో ఒకటి రెండు చిత్రాలే చేస్తున్నాను.. అయితే దక్షిణాదిలో మాత్రం ఒక్క అవకాశం కూడా రావడం లేదు.. కారణం ఏమిటో తెలియడం లేదు.. ఈ మధ్య ఒక తెలుగు దర్శకుడు వచ్చి కథ చెప్పారు మీరే కథానాయకి అని నమ్మపలికారు.. అంతే మళ్లీ కంట పడలేదు.. ఇప్పుడా చిత్రంలో వేరే నటి నటిస్తున్నారు. నన్నెందుకు తొలగించారని నేనా దర్శకుడిని అడిగితే సారీ అని ఫోన్ పెట్టేశారు.. అని తెగ బాదపడిపోతుంది ఇలియాన.

దేవదాసు సినిమాతో వచ్చింది.. పోకిరి సినిమాతో కుర్రకారును పిండి పిప్పిచేసింది. సన్న నడుము సుందరి అన్నా పోకిరీ భామ అన్నా ఆమే. ఒకప్పుడు తెలుగు తెరపై రచ్చ రచ్చ చేసిన ఇలియానా తర్వాతి కాలంలో బాంబే ఫ్లైట్ ఎక్కేసింది. అయితే అక్కడ ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకో – వచ్చినవి సక్సెస్ కాకో కానీ… ఆమె ఇటు దక్షిణాదికి అటు బాలీవుడ్ కి కాకుండా రెండికీ చెడ్డ రేవడిలా మారిపోయింది. అయితే తాజాగా తన ఆవేదనను నేరుగానే వ్యక్తపరిచింది ఇలియానా.

అవును.. తనను దక్షిణాది సినీ పరిశ్రమ దూరం పెట్టిందనే ఆవేదనను ఇలియానా వ్యక్తం చేశారు. బాలీవుడ్ మోజుతో దక్షిణాది చిత్రాలను తక్కువగా చూసింది అనే మాటను మోస్తున్న ఇలియానా… తాజాగా మళ్లీ దక్షిణాదికే మకాం మార్చాలన్న ప్రయత్నాలు మొదలెట్టిందట. ఇప్పటికే బికినీల్లో ఫోటోషూట్స్ ని ఆన్ లైన్ లో పోస్ట్ చేసి అవకాశాలకు వలవేసే ప్రయత్నాలు ముమ్మరంగా చేసిన ఈమె.. ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలన్న సామెతను మరిచిందని అంటున్నారు. అయినా కూడా ఇప్పటికీ దక్షిణాది దర్శక నిర్మాతల నుంచి మంచి పాత్రలో నటించే అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తున్నాను అని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. పాపం ఇలియానా ఎదురుచూపులకు ఫలితం రావాలని కోరుకుందాం!!