భర్త చేసిన వంట చూసి మురిసిపోతున్న ఇలియానా..

0పెళ్లి వరకు కూడా తన భర్త ప్రస్తావన తీసుకోరని ఇలియానా..తాజాగా ఆయన చేసిన వంట గురించి సోషల్ మీడియా లో షేర్ చేసుకొని తెగ మురిసిపోతుంది. కొన్ని రోజులుగా ఇలియానా జ్వరం తో బాధపడుతుందట. దీంతో ఆమె బాగోగులు అంత కూడా తన భర్త ఆండ్రూ నీబోన్‌ దగ్గరుండి చూసుకుంటున్నాడట.

ఈ విషయాన్ని ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడిస్తూ ఫొటో పోస్ట్‌ చేశారు. ‘ఒంట్లో బాలేనప్పుడు ఆయన దగ్గరుండి నన్ను చూసుకుంటారు. మా ఆయన బెస్ట్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చింది.

ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ ను ఇలియానా ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి వివాహం 2017లో ఇరు కుటుంబీకుల సమక్షంలో ఆస్ట్రేలియాలోనే రహస్యంగా జరిగింది. ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తుంది.