ఇంత నెగెటివిటీ నేనెప్పుడూ చూడలేదు: నాని

0

న్యాచురల్ స్టార్ నాని ‘బిగ్ బాస్- 2’ తెలుగు వెర్షన్ కు హోస్ట్ గా చేసేందుకు ఒప్పుకున్న రోజునుండి రీసెంట్ గా పూర్తయిన గ్రాండ్ ఫినాలే వరకూ దాదాపుగా టఫ్ జర్నీనే. మొదటి రోజు నుండే ఎన్టీఆర్ తో పోలికలు.. ఆ తరవాత లో-టీఆర్పీ పై విమర్శలు వచ్చాయి. ఈ సీజన్లో ఒక కంటెస్టంట్ అయిన బాబు గోగినేని ని కూడా నాని సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడని విమర్శలు వచ్చాయి. ఇక సీజన్ – 2 విన్నర్ కౌశల్ మందా ఎప్పుడైతే తన యాటిట్యూడ్ తో అభిమానులను సంపాదించుకోవడం మొదలుపెట్టాడో అప్పటి నాని పరిస్థితి ఇంకా దారుణంగా తయారయింది.

కౌశల్ ఆర్మీ తరచుగా నాని ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. హోస్ట్ గా నాని నిష్పక్షపాతంగా ఉండకుండా కౌశల్ ను అనవసరంగా టార్గెట్ చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఒకసారి నాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. ఇక బిగ్ బాస్-2 కంప్లీట్ అయ్యాక రీసెంట్ గా ఒక ఇంగ్లీష్ డైలీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు నాని. ఆ ఇంటర్వ్యూలో ఇక హోస్ట్ గా బిగ్ బాస్ కు రానని క్లారిటీ ఇచ్చాడు. నెగెటివిటీ ని హ్యాండిల్ చేయడంలో తనకు ఇబ్బంది ఎదురైనా బిగ్ బాస్ తనకు ఒక గొప్ప పాఠం అని.. తను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడో మరో సారి తనకు తెలిసిందని చెప్పాడు.

తన సినిమాలు ఫ్లాప్ అయినప్పడు కూడా ఇలాంటి నెగెటివిటీ చూడలేదని.. అందరూ తనపై అంత ప్రేమ – అభిమానం చూపించేవారని అన్నాడు. అందుకే నెగెటివిటీ ని భరించడం కష్టమైందని ఒప్పుకున్నాడు. “నేనసలే సెన్సిటివ్.. అందుకే ఇబ్బంది పడ్డాను” అని ఓపెన్ గా చెప్పాడు. కంటిన్యూగా తనపై విమర్శలు.. ట్రోల్స్ లాంటివి భరించడం తనకు శక్తికి మించిన పనైందని అన్నాడు.
Please Read Disclaimer