విదేశీ మద్యాన్ని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ స్వాధీనం

0foreign-alcohalషాద్‌నగర్ బస్టాండ్‌లో గురువారం విదేశీ మద్యాన్ని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బస్సులో విదేశీ మద్యం రవాణా అవుతున్న సమాచారం అందుకున్న అధికారులు తనిఖీలు జరిపారు. ఈ సందర్బంగా సూట్‌కేసులో దాచిన 22 బాటిళ్ళ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మద్యాన్ని రవాణా చేస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.