ఆ నటి ట్రస్ట్ గుట్టు ఐటీకి తెలిసిపోయిందట!

0

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అని తెలుగులో ఒక సామెత ఉంది. మరి ఇన్ కమ్ ట్యాక్స్ బారి నుండి తప్పించుకునేందుకు టాలీవుడ్ లో ఒక సీనియర్ హీరోయిన్ కూడా అలాంటి అనంతకోటి ఉపాయాల్లో నుంచి ‘ట్రస్ట్’ ఉపాయాన్ని బయటకు తీసి వాడిందట. తల్లి పాత్రలకు బాగా ఫేమస్ అయిన ఆ సీనియర్ హీరోయిన్ ఎప్పుడూ తన రెమ్యూనరేషన్ రెండు రకాలుగా తీసుకుంటుందట. 30% మాత్రం తన పేరు మీద తీసుకుని మిగతా 70% తను నిర్వహించే ఒక ట్రస్ట్ పేరు మీద తీసుకుంటుందట. అంటే.. ట్యాక్స్ నిల్లు!

అందరూ మాత్రం ఆమె తన ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతోందని అనుకుంటూ ఉంటారు. కానీ ఈమధ్య ఇన్ కమ్ ట్యాక్స్ వారికి అనుమానం వచ్చి ఆధారాలు సేకరించారట. ఆ తర్వాత ఆమెకు ఏం జరుగుతోందో వివరించమని నోటీసులు కూడా ఇచ్చారట. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించని ఆమె ఐటీవారి దెబ్బకు షాక్ తిన్నదట. ఆమె రాజకీయల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తోందని.. అందుకే ఐటీ ఝలక్ తగిలిందని కొందరు అంటున్నారు.

కానీ మరికొందరేమో ఆ నటి కుమారుడు ఈమధ్య కొత్త బిజినెస్ మొదలు పెట్టాడని.. ఆ దెబ్బకు బ్లాక్ మనీ అంతా బయటకు రావడంతో ఐటీ వారి కన్ను ఆమె ఆర్థిక వ్యవహారాలపై పడిందని అంటున్నారు. ఏదేమైనా ఆ నటి విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.
Please Read Disclaimer