యానిమేషన్ చిత్రం సరికొత్త రికార్డ్

0యానిమేషన్ సినిమాలకు ఉండే ఆదరణ గత కొంత కాలంగా ఎక్కువవుతోంది. కంప్యూటర్ మాయాజాలంతో కట్టిపడేసే యానిమేషన్ చిత్రాల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎమోషన్ ని కూడా యాడ్ చేసి కన్నీళ్లు తెప్పించగలరు. హాలీవుడ్ లో చాలా వరకు యానిమేషన్ చిత్రాలకు అత్యధిక వసూళ్లు అందుతున్నాయి. ఇటీవల వచ్చిన ఇన్ క్రెడిబుల్స్ 2 అయితే ప్రపంచ బాక్స్ ఆఫీస్ లలో ఒకటిగా నిలిచింది.

ఇప్పటివరకు రిలీజ్ అయిన యానిమేషన్ లలో ఈ సినిమానే అత్యధిక వేగంగా మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ఈ సూపర్ హీరో ఫిల్మ్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. 4410 లొకేషన్స్ లలో రిలీజ్ అయ్యి అన్ని సినిమాలకంటే ఎక్కువ వేగంగా $185 మిళియన్స్ కొల్లగొట్టింది. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ – పిక్సర్ యానిమేషన్ స్టూడియోస్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాయి. బ్రాడ్ బర్డ్ సినిమాకు దర్శకత్వం వహించారు. 2016 లో పిక్సల్ వారి సీక్వెల్ ఫైండింగ్ డోరీ 135 మిలియన్ డాలర్లను ఫాస్ట్ గా అందుకుంది.

గత ఏడాది రిలీజ్ అయిన మరో అద్భుత యానిమేటెడ్ ఫిల్మ్ బ్యూటీ అండ్ ది బీస్ట్ 175 మిలియన్ డాలర్లతో అత్యధిక వేగంగా భారీ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఇక పాత రికార్డులన్నిటిని తక్కువ సమయంలో బ్రేక్ చేసింది ఇన్క్రెడిబుల్స్ 2. ఇంకా ఈ సినిమా చాలా దేశాల్లో విడుదల కాలేదు. ఇంకా ఆ లెక్కలు సపరేట్ గా ఉన్నాయి. మరి మొత్తంగా ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడాలి.