ఇండియన్ 2 చేతులు మారతాడా ?

0

ఎంతో ప్రతిష్టాత్మకంగా 2.0 తర్వాత శంకర్ తలపెట్టిన ఇండియన్ 2 మీద అనుమాన మేఘాలు పూర్తిగా తొలగిపోలేదు. కమల్ హాసన్ ఒకపక్క రాజకీయ వ్యవహారాల్లో పూర్తిగా తలమునకలైపోయాడు. లైకా సంస్థ దీనికి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు. ఇతర సినిమాల నిర్మాణంలో బిజీ అయిపోయింది. మీడియాకు దాని ప్రతినిధులు అందుబాటులోకి రావడం లేదు.

ఈ నేపధ్యంలో అసలు ఇండియన్ 2 ఉంటుందా లేదా అనే అనుమానాలు రోజురోజుకి బలపడుతున్నాయి. 2.0 మీద నాలుగు వందల కోట్ల దాకా బడ్జెట్ పెట్టామన్న లైకా సంస్థ అంత స్థాయిలో రిటర్న్స్ రాబట్టుకోలేకపోయింది. నార్త్ లో కొంత భాగం తప్ప తెలుగు తమిళ వెర్షన్ల పెట్టుబడులు పెట్టినవారందరూ నష్టపోయారు. ఇది లైకా బ్రాండ్ మీద కూడా ఎఫెక్ట్ చూపించింది

ఇప్పుడు అదే రిపీట్ కాకూడదనేదే లైకా ఉద్దేశం. అందుకే బడ్జెట్ ఎంతవుతుంది ముందే చెప్పి అగ్రిమెంట్ రాసుకుందామని లైకా ప్రతిపాదిస్తే అందుకు శంకర్ సమాధానం చెప్పలేక మౌనాన్ని ఆశ్రయించాడని చెన్నై టాక్. అందుకే ఇప్పుడు రిలయన్స్ సంస్థ రంగంలోకి దిగినట్టు అప్ డేట్.

ఇండియన్ 2ని టేకాఫ్ చేసేందుకు రిలయన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో శంకర్ ఇప్పటికే ఓ దఫా చర్చలు జరిపాడట. ఇప్పటిదాకా ఈ ప్రాజెక్ట్ అమలులోకి రావడానికి లైకా పెట్టిన ఖర్చుని వెనక్కు చెల్లించే పక్షంలో ఇది రిలయన్స్ కి ఇచ్చేలా ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం. మరి సౌత్ లో అడపాదడపా పెద్ద సక్సెస్ లు లేని రిలయన్స్ సంస్థ ఇంత పెద్ద ప్రాజెక్ట్ కోసం ముందుకు వస్తుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్
Please Read Disclaimer