షాకింగ్: సెక్సీ సూపర్ హీరోస్ కార్టూన్స్

0రొమ్ములు విరుచుకుని జబ్బలు చరుచుకుంటేనే సూపర్ హీరోనా? బాహువులు బిగించి గాల్లో మేడలు మిద్దెలపైనుంచి దుమికేసి – ఆకాశహార్మ్యాల్లోకి ఎగిరి గంతేస్తేనే సూపర్హీరోనా? ఏం సూపర్ హీరోల్ని ఇలానే ఎందుకు చూపించాలి. కాస్తంత అలా అలా సిగ్గుపడుతూ బిడియం ప్రదర్శిస్తూ కొంటెగా తమ అందాల్ని దాచేసుకుంటూ ఎందుకు కనిపించకూడదు. సూపర్ హీరోల్లో సెక్సిజమ్ ఎందుకు కూడదు? సూపర్ హీరోలు సెక్సీగా ఎందుకు కనిపించకూడదు? ఎందుకంత ఈగో ఈ మగాళ్లకు? … ఇలా ఆలోచించినట్టుంది ఆవిడగారు.

ఇంకేం ఉంది.. ఆలోచన వచ్చిందే తడవుగా వాళ్లను అలా ఎందుకు చూపించకూడదు? అంటూ కార్టూన్లు గీసేసింది. ఆ ఆలోచనలకు తగ్గట్టు సిగ్గుతో – బిడియంతో అన్నిటినీ దాచేసుకునే అందమైన కార్టూన్లలోకి సూపర్ హీరోల్ని లాగి పడేసింది.సెక్సీ సూపర్ హీరో – సెక్సీ హల్క్ – సెక్సీ షి-హల్క్ అంటూ పలు కార్టూన్లతో విరుచుకుపడింది. కొంత ఫన్ – మరికొంత సెటైర్ ఈ పోస్టర్లలో కనిపిస్తోంది. ఇంతకీ ఈ పని చేసిందెవరో తెలుసా? మన భారతీయ మహిళనే. అహ్మదాబాద్ ఎన్ ఐటికి చెందిన కొంటె స్టూడెంట్ శ్రీయ అరోరా ఐడియా ఇది. ఈవిడ గీసిన కార్టూన్లు అమ్మాయిలే సిగ్గుపడేలా ఉన్నాయంటే నమ్మండి! సూపర్ హీరోల్లో సెక్సిజమ్ టాపిక్ పై స్టన్నింగ్ అనిపించే కార్టూన్లతో విరుచుకుపడింది.

ఈ కార్టూన్లలో ఫెమినిజమ్ ని ఎలివేట్ చేస్తూనే చాలా చాలా మ్యాజిక్ చేసింది అరోరా గాళ్. ఇవన్నీ టీనేజీ బోయ్స్ – టీనేజీ గాళ్స్ ని టీజ్ చేస్తూ వాళ్లలో ఆసక్తి రేకెత్తించేందుకే ఇలా చేసిందిట. ఇక ఈ కామిక్ కార్టూన్లను 3డి గ్రాఫిక్ పోస్టర్లుగానూ మార్కెట్ లోకి తెచ్చారు. అలానే పలు మ్యాగజైన్ కవర్ పేజీలుగానూ ప్రింట్ చేశారు. అరోరా ఐడియా బాగానే ఉంది. వందల కోట్ల బిజినెస్ ని ప్రభావితం చేసే గొప్ప ఐడియానే ఇది. అయితే మరీ ఇలా సూపర్ హీరోల్ని బాత్రూమ్ లో అమ్మాయిల్లా సిగ్గుపడేలా చేసేసిందేంటో! అంటూ కొందరు కొంటె కుర్రాళ్లు తమదైన శైలిలో కామెంట్లతో విరుచుకుపడ్డారట. వామ్మో ఈవిడ ఆలోచన పాడుగానూ!