సడన్ గా యాక్షన్ అంటే ఒప్పుకుంటారా?

0కమర్షియల్ దర్శకులు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. కానీ అందరి శైలి ఒకేలా ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఇక లవ్ స్టోరీస్ తీసే వారి సంఖ్య కూడా చాలానే ఉంది. అందులో కూడా రకరకాల డైరెక్టర్స్ ఉన్నారు. ఇకపోతే ప్రతిసారి డిఫరెంట్ కథలను చేసే లిస్ట్ లో మోహన్ కృష్ణ ఉన్నాడనే చెప్పాలి. మనోడి మేకింగ్ స్టైల్ ఓ రకంగా ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి.

అయితే ఎన్ని హిట్స్ అందుకున్నా కూడా ఆయన పెద్ద సినిమాలు చేయడం లేదు. నానితో ఆ మధ్య జెంటిల్ మెన్ చేసి ఇలాంటి డ్రామా కూడా మోహన్ కృష్ణ అందంగా చూపించగలడని నిరూపించుకున్నాడు. అయితే ఎన్ని చేసినా యాక్షన్ వైపు మాత్రం ఆయన శైలి వెళ్లలేదు. ఇక నెక్స్ట్ అదే సినిమా చేస్తాను అన్నట్లు ఇటీవల ప్రెస్ మీట్ లో చెప్పాడు. ఆయన సినిమాలు చాలా బాగుంటాయని మెగాస్టార్ చిరంజీవి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పారు.

అయితే వాళ్ళు ఈ డిఫరెంట్ దర్శకుడితో సినిమాలు చేయడానికి ఒప్పుకుంటే ఎలా మెప్పిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. మంచి దర్శకులు కథ చెబుతాను అంటే వాళ్లు వినకుండా ఉండరు. తప్పకుండా నచ్చితే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. మోహన్ కృష్ణ మేకింగ్ కు తగ్గట్టు రొమాంటిక్ లవ్ స్టొరీ లను ఊహిస్తే.. సడన్ గా ఆయన యాక్షన్ కథలు అంటే ఒప్పుకుంటారా అనేది సందేహమే. ఈ దర్శకుడు ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి మరి.