‘సైరా’ లో మెగాస్టార్ గురువు ఆయనే..?

0Sye-Raa-Narasimha-Reddy-Firమునుపెన్నడూ లేనివిధంగా భారీ అంచనాలతో తెరకెక్కుతున్న బయోపిక్ చిత్రం ‘సైరా’. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ నటుడు విజయ్ సేతుపతి వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ పాత్ర గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది.

అమితాబ్ ఈ చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి గురువుగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిగురించి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. నయనతార హీరోయిన్ గా నటించనుంది.