ఐపీఎల్‌.. మొదటి మ్యాచే పైసా వసూల్

0ఐపీఎల్‌ 2018 ఆరంభంలో అదిరిపోయింది. రెండేళ్ల నిషేధం అనంతరం ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్‌ ఈ సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. ముంబయి ఇండియన్స్‌ నిర్దేశించిన 166పరుగుల లక్ష్యాన్ని వికెట్‌ తేడాతో గెలుచుకొని చెన్నై అభిమానులకు సిసలైన టీ20 మజాను అందించింది.

అంతకుముందు ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసురుతుండటంతో చెన్నై ఓటమి దాదాపు ఖాయం అనుకున్నారంతా! ఈ క్రమంలో 105పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి చెన్నై పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ముంబయి ఇండియన్స్‌ ఆశలను అడియాసలు చేస్తూ చెన్నై ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో 68(30) చెలరేగి ఆడి చెన్నైను దాదాపు విజయతీరాలకు చేర్చాడు. అయితే, 18 ఓవర్ చివర్లో బ్రావో ఔట్‌ కావడంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. కానీ రిటెర్డ్‌హర్ట్‌గా క్రీజు వదిలి వెళ్లిన కేదార్‌ జాదవ్‌ మళ్లీ 19ఓవర్‌లో బ్యాటింగ్‌ కి వచ్చి .. ఒక సిక్స్, ఫోర్ కొట్టి ఇంకా రెండు బంతులు వుండాగానే చెన్నయ్ విజయం ఖాయం చేశాడు. మొత్తంమ్మీద మొదటి మ్యాచే పైసా వసూల్ అనిపించింది.