మహేష్ బాబు విలన్ ఆరోగ్య పరిస్థితి విషమం..?

0మహేష్ బాబు నటించిన సైనికుడు సినిమాలో విలన్ గా నటించిన ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి చాల విషమం గా ఉన్నట్లు బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. చాలా అరుదైన బ్రెయిన్ కాన్సర్ తో ఈయన బాధపడుతుండడం తో ఇక్కడ ట్రీట్మెంట్ పూర్తి స్థాయిలో నయం చేసేలా లేకపోవడంతో అమెరికాకు తీసుకవెళ్లబోతున్నారు.

ప్రస్తుతం ఈయన విశాల భరద్వాజ్ డ్రీం ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ఇర్ఫాన్ కు ఇలా కావడం తో చిత్ర యూనిట్ భాదను వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న దీపికా పదుకునే సైతం తీవ్రమైన వెన్నునొప్పికు గురై అన్ని షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చేసింది. తిరిగి ఎప్పుడు పాల్గొనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో సినిమాలో ముఖ్యమైన ఈ ఇద్దరు ఒకేసారి అనారోగ్యానికి గురి కావడం తో విశాల్ కు ఏంచేయాలో తెలియడం లేదు.