వోల్వో బస్సు జెసిదా.. ?

0jabbar-bus-mishapమహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద ఈరోజు తెల్లవారుజామున అగ్నికి ఆహుతైన బస్సు ’జబ్బార్ ట్రావెల్స్’ కు చెందినదని అయినప్పటికినీ.. అది జేసీ ట్రావెల్స్ పేరుతో రిజిస్టర్ అయినట్లు సమాచారం. AP 02 TA 0963 నెంబర్ గల బస్సు దివాకర్ రోడ్డు లైన్ పేరుతో అనంతపురంలో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. అయితే, ఆర్టీఏ రికార్డుల్లో మాత్రం బస్సు స్టేటస్ ఇనాక్టివ్ గా వున్నట్లు తెలుస్తోంది. జెసి ట్రావెల్స్ వారు బస్సును జబ్బార్ ట్రావెల్స్ కు విక్రయించారా.. ? లేదా ఏదైనా.. ఒప్పందంలో ఇచ్చారా.. ? తేలాల్సివుంది. దీనిపై విచారణ చేస్తున్నట్లు అదికారులు చెబుతున్నారు. కాగా, జబ్బర్ ట్రావెల్స్ యజమాని పరారీలో వున్నట్లు సమాచారం. ఫోన్ ను కూడా స్వీఛ్ఛావ్ లో వుంచినట్లు తెలుస్తోంది.

కాగా, అగ్నికి ఆహుతైన వోల్వో బస్సుతో తమకెలాంటి సంబంధం లేదని దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఆ బస్సును తాము 2010లో జబ్బార్ ట్రావెల్స్ కు విక్రయించామని పేర్కొంది. ఆ మేరకు బస్సు అమ్మకపు ఒప్పంద పత్రాన్ని విడుదల చేసింది. బస్సు రిజిస్ట్రేషన్ ను మార్చుకోవాలని తాము పలుమార్లు జబ్బార్ ట్రావెల్స్ యాజమాన్యానికి సూచించామని దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం తెలిపింది. కాగా, మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి కుటుంబానికి అనేక ప్రైవేటు బస్ లు ఉన్న సంగతి తెలిసిందే.