మళ్లీ జక్కన్ననే ఫాలో అవ్వబోతున్న శంకర్

0

ఇండియన్ సినిమా దిగ్గజ దర్శకుల్లో ముందు వరుసలో సౌత్ దర్శకుడు శంకర్ ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కెరీర్ లో ఎన్నో అద్బుత చిత్రాలను తెరకెక్కించిన శంకర్ భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. బాలీవుడ్ చిత్రాల బడ్జెట్ కంటే అధికంగా శంకర్ తన సినిమాలకు బడ్జెట్ ను ఖర్చు చేస్తాడు. శంకర్ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా ఈజీగా వస్తుందని అంటారు. బాహుబలి చిత్రం తర్వాత అంతకు మించిన విజువల్ వండర్ మూవీని తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో 2.ఓ చిత్రాన్ని రూపొందించాడు. ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటి వరకు పెట్టని బడ్జెట్ ను ఆ చిత్రంకు పెట్టించాడు. బాహుబలిని మించేలా 2.ఓ చిత్రాన్ని అయితే తెరకెక్కించాడు కాని కలెక్షన్స్ విషయంలో నిరుత్సాహ పర్చాడు.

ఇక ప్రస్తుతం కమల్ హాసన్ తో ‘భారతీయుడు 2’ చిత్రంను శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యి కొన్ని సీన్స్ చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఎన్నికల కారణంగా సినిమాను నిలిపేయడం జరిగింది. ఈ సమయంలోనే సినిమా మొత్తానికి క్యాన్సిల్ అయ్యిందని కమల్ పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉంటున్న కారణంగా సినిమాకు టైం కేటాయించలేక పోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా క్యాన్సిల్ అయిన నేపథ్యంలో ఒక భారీ మల్టీస్టారర్ చిత్రంను శంకర్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

తమిళ స్టార్ హీరోలు అయిన విజయ్ మరియు విక్రమ్ లతో శంకర్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి తెలుగు స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకున్న క్రేజ్ నేపథ్యంలో తాను కూడా భారీ మల్టీస్టారర్ చేయాలని శంకర్ ఆశ పడ్డట్లుగా తెలుస్తోంది. శంకర్ ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్లు ఇచ్చేందుకు విజయ్ మరియు విక్రమ్ లు సిద్దంగా ఉన్నారని తప్పకుండా వీరిద్దరితో శంకర్ సినిమా ఉంటుందని తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు హీరోలతో శంకర్ గతంలోనే సినిమాలు తీసి వారికి సూపర్ హిట్స్ ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి వారిద్దరిని కలిపి డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. ఆర్ఆర్ఆర్ స్థాయిలోనే ఈ చిత్రంపై కూడా తమిళనాట అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయని అనిపిస్తుంది. మరి జక్కన్నను ఈసారైనా శంకర్ అందుకోగలడా అనేది చూడాలి.
Please Read Disclaimer