నాగబాబుకు తెలీకుండా దాడి జరిగిందా?

0nagababuడీజే – దువ్వాడ జగన్నాధం మూవీ కలెక్షన్స్ విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ అత్యుత్సాహం చూపించడం.. చిలికి చిలికి గాలివానగా మారింది. నైజాం కలెక్షన్స్ పై ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశాడు. నైజాం ఏరియా అంటే.. అవి నిర్మాత కం డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు హ్యాండ్ లేకుండా బైటకు వచ్చే ఛాన్స్ లేదు. డీజే మూవీతో అన్ని రికార్డులు బద్దలైపోయాయన్న మాట మెగా ఫ్యాన్స్ కు నచ్చకపోవడంతో.. దిల్ రాజు ఆఫీస్ ను ముట్టడించారు.

అయితే.. ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన పని ఇదంతా అని అందరూ అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రాష్ట్ర చిరంజీవి యువత తరఫున కొందరు దిల్ రాజును నిలదీశారట. కాని అదే పెద్ద షాకింగ్ అంశం అని చెప్పాలి. నిజానికి మెగాస్టార్ కు చెందిన ఫ్యాన్స్ అసోసియేషన్స్ అన్నిటినీ మెగా బ్రదర్ నాగబాబు హ్యాండిల్ చేస్తుంటారు. వాళ్ల యాక్టివిటీస్ అన్నిటికీ ఆయన ఆమోదం ఉండాల్సిందే. నాగబాబు అనుమతితోనే పలు రకాల స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు బన్నీ సినిమా నిర్మాతను నిలదీయడం.. నాగబాబుకు తెలిసి జరిగిందా.. తెలీక జరిగిందా అనే విషయమే ఆసక్తి కలిగిస్తోంది.

నాగేంద్రబాబుకు కనుక తెలిస్తే.. మెగా ఫ్యాన్స్ ఇలా చేసేందుకు ఒప్పుకోనిచ్చే సమస్య లేదనే అంటున్నారు సన్నిహితులు. ఎందుకంటే.. నాగబాబును ఆర్థికంగా ఒడ్డున పడేసేందుకు.. బన్నీ కొత్త సినిమా ‘నా పేరు సూర్య’లో నాగబాబును అధికారికంగా కో-ప్రొడ్యూసర్ ను చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా ఆయన పెట్టుబడి పెట్టేదేమీ లేదు. కేవలం బన్నీ డేట్లు ఇచ్చినందుకు ఆయనకు డబ్బు వస్తుందని ఒక టాక్ కూడా ఉంది. మరి బన్నీ అంత హెల్ప్ చేస్తున్న సమయంలో.. డీజే సినిమా నిర్మాతపై దాడి చేసేందుకు మెగా ఫ్యాన్స్ తీసుకున్న నిర్ణయానికి.. నాగబాబు సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంటుందా?