కంచె బ్యూటీ లవ్ లో ఉందా?

0

అందం తో పాటు గ్లామర్ ఎలివేషన్ కి ఏమాత్రం అడ్డు చెప్పని కథానాయికగా ముంబై బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ పాపులరైంది. కంచె సినిమాలో సాంప్రదాయ బద్ధంగా కనిపించినా.. ఆ తర్వాత `ఆచారి అమెరికా యాత్ర` చిత్రంలో అసలు ట్యాలెంట్ చూపించింది. అయితే కాలం కలిసి రాకపోవడంతో తెలుగులో తన కెరీర్ ఆశించిన స్థాయికి ఎదగలేదు. ప్రస్తుతం ఈ భామ నిరంతరం సామాజిక మాధ్యమాల్లో మాత్రం వేడి పెంచుతూనే ఉంది. అక్కడ లేటెస్ట్ ఫోటోషూట్లతో టచ్ లో ఉంటోంది. తాజాగా మరోసారి లేటెస్ట్ ఫోటోలతో సామాజిక మాధ్యమాల్లో విరుచుకుపడింది.

ప్రగ్య ప్రస్తుతం బికినీ బీచ్ సెలబ్రేషన్స్ లో బిజీబిజీగా ఉంది. ఈ అమ్మడు విదేశీ బీచ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన రకరకాల ఫోటోల్ని అభిమానులకు షేర్ చేసి ఆసక్తికర క్యాప్షన్స్ ఇచ్చింది. ఓ ఫోటోలో సూర్యుడు అస్తమిస్తున్న వేళ సాగరంలో జలకాలాడుతూ.. రెండు చేతి వేళ్లను కలిపి లవ్ సింబల్ ని ఆవిష్కరించింది. వేరొక ఫోటోలో బీచ్ లో తాపీగా నడిచి వెళుతూ వెనక్కి తిరిగి చూస్తోంది. ఆ పిక్ లో ప్రగ్య థై షోస్ యూత్ ని కట్టిపడేస్తోంది. వేరొక ఫోటోలో తన సోదరితో కలిసి ఓ భారీ గ్రద్ధ ఆకారం విగ్రహం చెంత ఫోజులిచ్చింది. అక్కడికి తన సిస్టర్ కోసమే వెళ్లాల్సి వచ్చిందని సెలవిచ్చింది.

మొత్తానికి ప్రగ్య డీప్ లవ్ లో ఉందని అర్థమవుతోంది. ఎవరితో అంటే..? వరుసగా ఎడతెరిపి లేకుండా బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో.. జాలీ ట్రిప్ లతో లవ్ లో ఉందని అర్థమవుతోంది. అన్నట్టు అప్పట్లో ఓ యువహీరోతో ప్రేమలో ఉందని.. ఓ టాలీవుడ్ దర్శకుడితోనూ నిండా లవ్ లో మునిగిందని ప్రచారమైంది. తాజా సన్నివేశం చూస్తుంటే అవన్నీ గాసిప్పులేనని నమ్మాల్సొస్తోంది. లేదూ వాన్నిటికంటే ఇలా షికార్లతో ప్రేమలో పడడమే బెటరని భావించిందంటారా?
Please Read Disclaimer