సునీల్ రేంజ్ కు నాలుగు లక్షలు

0కమెడియన్ నుంచి హీరోగా మారిన వారిలో సునీల్ ఒకరని అందరికి తెలిసిందే. కమెడియన్ గా అందుకున్న క్రేజ్ సునీల్ హీరోగా మాత్రం అందుకోలేకపోయారు. మొదట చేసిన మర్యాద రామన్న తప్పితే సునీల్ పెద్దగా సక్సెస్ చూడలేదు. ఆ తరువాత పూలరంగడు క్రేజ్ తో ఆడేసింది. కానీ ఆ తరువాత స్టార్ హీరో అవుతాడు అనుకుంటే వరుసగా డిజాస్టర్స్ తో పాత సునీల్ ని మర్చిపోయేలా చేశాడు.

ఇక ఆడియెన్స్ కి ఎక్కువగా గ్యాప్ ఇవ్వకూడదని కమెడియన్ పోస్ట్ కి షిఫ్ట్ అయ్యాడు. త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే శ్రీను వైట్ల – హను రాఘవపూడి సినిమాలతో పాటు భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. చిన్న దర్శకులతో హీరోగా చేసి ప్లాప్ అందుకున్న సునీల్ పెద్ద దర్శకులతో చేసి కమెడియన్ గా ఒక హిట్టు కొట్టాలని అనుకుంటున్నాడు. ఇక మనోడికి డైలీ కాల్షీట్ లెక్కన పేమెంట్ అందుతుందట.

అసలే కమెడియన్స్ తక్కువయ్యారు. బ్రహ్మానందం క్రేజ్ తగ్గగా.. వెన్నల కిశోర్ పెద్దగా కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో స్టార్ కమెడియన్స్ గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇక సునీల్ ను సరికొత్తగా చూపించడానికి పెద్ద దర్శకులు పోటీ పడుతున్నారు. డైలీ నాలుగు లక్షల వరకు పేమెంట్ అందుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సునీల్ చేస్తున్న సినిమాలన్నీ కూడా మంచి గుర్తింపు తెచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.