సన్నీ లియోన్ కి ఇదేం అలవాటో !

0శర్వానంద్ మహానుభావుడు సినిమాలో హీరో పదే పదే శుభ్రత గురించి అతి జాగ్రత్త తీసుకోవడం చూసి అసలు ఇలాంటి వాళ్ళు ఉంటారా అని అనుమానం వచ్చింది కానీ అందుకు సాక్ష్యంగా నిలిచేలా ఉంది పోర్న్ స్టార్ సన్నీ లియోన్. తనకో విచిత్రమైన అలవాటు ఉందట. షూటింగ్ లో ఉన్నా లేక బయట ఉన్నా లొకేషన్ ఏదైనా ఎప్పుడైనా తన సుతారమైన పాదాలను ప్రతి 15 నిమిషాలకు ఒక సారి శుభ్రంగా కడుక్కుని ప్రొసీడ్ అవుతుందట. ఎందుకు అనే డౌట్ అక్కర్లేదు. తన శరీరంలో సన్నీకి ఇష్టమైన మొదటి భాగం పాదాలేనట. దేహం భారాన్ని మోయటంతో పాటు అవతలి వాళ్లకు మన మీద సదాభిప్రాయాన్ని కలిగించే పాదాలను జాగ్రత్తగా చూసుకునే విషయంలో రాజీ పడే సమస్యే లేదంటోంది. ఇది తనతో సినిమాలు తీసే వాళ్లకు తెలిసిన విషయమే అయినప్పటికీ ఫాన్స్ కు అవగాహన లేదు.

ఒక పక్క హీరోయిన్ గా మరోపక్క వ్యాపారవేత్తగా డ్యూయల్ రోల్ విజయవంతంగా పోషిస్తున్న సన్నీ లియోన్ ముగ్గురు పిల్లల తల్లిగా మరో ఆదనపు బాద్యతను కూడా అంత సమర్ధతతో నిర్వహిస్తోంది. మొదటిసారి స్కిన్ షో చేయకుండా హిస్టారికల్ పాత్రలో సన్నీ నటించిన వీరమాదేవి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తమిళ్ లో రూపొందుతున్న ఈ మూవీని ఇతర భాషల్లో కూడా డబ్ చేయనున్నారు. అలవాటు గురించి ఇన్నాళ్లు భయపడకుండా జాగ్రత్త పడిన సన్నీ తన పాదాల పట్లే ఇంత శ్రద్ధ చూపుతోంది అంటే శరీరం గురించి ఇంకే స్థాయిలో తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాలా.