ఇది జిమ్ వర్కౌట్ అంటే..

0ప్రస్తుతం దేశంలో సెలబ్రెటీలు సోషల్ మీడియాలో సరికొత్తగా కనిపిస్తున్నారు. ప్రధాన మంత్రి ఫిట్ నెస్ మంత్ర ప్రతి ఒక్కరు పాటిస్తూ వారి ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఎప్పుడు వ్యాయామం అంటే తెలియని వారు కూడా జిమ్ లో తెగ కష్టపడుతున్నారు. కొందరైతే స్పెషల్ జిమ్ కిట్స్ ఇంటికే తెచ్చుకొని మరి చేస్తున్నారు. ఇలా ఎవరి స్టైల్ లో వారు కష్టపడితే.. ఒక హీరోయిన్ మాత్రం ఎవరు ఊహించని అసలైన వర్కౌట్ చేసింది.

మిడిల్ క్లాస్ మహిళలు రోజు చేసే వర్కౌట్ అదే మరి. రోజు గంటల తరబడి జిమ్ లో కష్ట పడటం కన్నా ఇంట్లోనే నాలుగు పనులు చేస్తే దానికంటే పెద్ద జిమ్ వర్కవుట్ మరోటి ఉండదు. అయితే ఆ తరహాలో ఇషా తల్వార్ బాగానే కష్టపడుతున్నట్టు ఒక వీడియో ద్వారా చెప్పేసింది. తన ఇంట్లోని ఫ్లోర్ ని బట్ట తో తుడుస్తూ ఇదే ఫిట్ నెస్ కి మంచి మార్గమని హోమ్ వర్కవుట్ అని చెబుతోంది. ఈ బ్యూటీ తెలుగు జనాలకు పరిచయమే. గుండె జారీ గల్లంతయ్యిందే సినిమాతో అందరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

సెలబ్రెటీలు ఎవరికి వారు జిమ్ వర్కౌట్స్ ఛాలెంజ్ లో విసురుతూ జిమ్ లో దర్శమిస్తుంటే.. ఇషా మాత్రం ఇలా సింపుల్ గా ఇంటి పనులను చేస్తూ కనిపించింది. ఓ విధంగా అమ్మడు అందరికంటే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆ విధంగా ఆలోచించే అమ్మాయిలు చాలా తక్కువ ఉంటారని చెప్పాలి.