‘ఇస్మార్ట్ శంకర్’ భారీ యాక్షన్ షురూ

0

ఎనర్జిటిక్ హీరో రామ్.. స్పీడ్ డైరెక్టర్ పూరి కాంబినేషన్ లో `ఇస్మార్ట్ శంకర్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఫ్లాపుల్లో ఉన్నా.. ఈ జోడీ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారన్న చర్చ సాగుతోంది. ఇక ప్రచారం పరంగా ఆరంభమే టైటిల్.. పోస్టర్లతో ఆసక్తిని పెంచడంలో సఫలమయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా రామ్ న్యూలుక్ అభిమానుల్లోకి దూసుకెళ్లింది. పైగా అతడు భారీగా యాక్షన్ హీరో తరహాలో కండలు పెంచి పవర్ ఫుల్ ప్యాక్ తో దర్శనమివ్వడం ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ గా మారింది. అందుకే ఇస్మార్ట్ టీమ్ ఏం చేసినా దానిపై ఫ్యాన్స్ ఓ కన్నేసి ఉంచుతున్నారు.

ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి పూరి అండ్ టీమ్ `డబుల్ దిమాక్ హైదరాబాది` అనే ఉపశీర్షికను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ట్యాగ్ లైన్ కి తగ్గట్టే ఈ చిత్రంలో మాస్ ని ఆకట్టుకునే భారీ పోరాట ఘట్టాలకు కొదవేం ఉండదని తెలుస్తోంది. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని రేపటి నుండి వారణాసిలో చిత్రీకరించనున్నారు. యాక్షన్ పార్ట్ హైలైట్ గా తీర్చి దిద్దేందుకు పూరి ఈ ఫైట్ సీన్ ని తనే స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తారట. ఇప్పటికే పూరి- ఛార్మి టీమ్ వారణాసి వెళ్లారు. మార్గం మధ్యలో ఉన్న బృందం ఓ వీడియోని తాజాగా రివీల్ చేసింది. ఛార్మి ఈ వీడియోని స్వయంగా తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. రేపటి నుంచి ఇస్మార్ట్ శంకర్ కి సంబంధించిన ఫైట్ సీన్ ని వారణాసిలో చిత్రీకరిస్తున్నామని ఛార్మి స్వయంగా వెల్లడించారు. అదే బస్ లో పూరి కూడా హాయ్ చెబుతూ ఎంతో జోష్ తో కనిపించారు. మొత్తానికి ఈ ట్రిప్ ని ఏదో జాలీ ట్రిప్ లా పూరి – ఛార్మి బృందం ఎంజాయ్ చేస్తోందని అర్థమవుతోంది.

రామ్ – నిధి అగర్వాల్- నభానటేష్ నాయకానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి- షాయాజీ షిండే- దీపక్ శెట్టి- సత్యదేవ్- తులసి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్- పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్- ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

 

వీడియో కోసం క్లిక్ చేయండి 
Please Read Disclaimer