ఇస్మార్ట్ టీమ్ వెనక్కు!

0

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం లేటెస్ట్ షెడ్యూల్ ఈమధ్యే వారాణాసిలో జరిపారు. ఆ షూటింగ్ లొకేషన్ నుండి ఇప్పటికే హీరోయిన్ నిధి అగర్వాల్ తన సోషల్ మీడియా ద్వారా ఇంట్రెస్టింగ్ ఫోటోలు కూడా షేర్ చేసుకున్న విషయం తెలిసిందే.

తాజా అప్డేట్ ఏంటంటే వారణాసి షెడ్యూల్ పూర్తయిందట. ఈ షెడ్యూల్ లో ఒక కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించారని సమాచారం. ఈ షెడ్యూల్ వారణాసిలో ఏడు రోజుల పాటు జరిగింది. ఈ షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత ఇస్మార్ట్ శంకర్ టీమ్ హైదరాబాద్ తిరిగి వస్తూ విమానాశ్రయంలో కనిపించగా ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు. ఈ ఫోటోలో రామ్.. పూరి జగన్నాధ్.. ఛార్మీ లతో పాటుగా మరో ఇద్దరు ఉన్నారు. ఫోటోలో రామ్ యాజ్ యూజువల్ గా ఎనర్జిటిక్ గా ఉండగా.. పూరి జగన్.. ఛార్మీ మాత్రం చిరునవ్వులు చిందిస్తున్నారు.

‘ఇస్మార్ట్ శంకర్’ లో రామ్ సరసన నిధి అగర్వాల్.. నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్.. పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer