అతనైతే ఫ్రీగా చేస్తా నంటున్న ఐశ్వర్య

0iswarya-menonతొలి రోజుల్లో అవకాశాలు రాబట్టుకోవడానికి హీరోయిన్లు ఎన్ని రకాల ట్రిక్స్‌ ఉపయోగించాలో అన్నీ చేస్తారు. అందలం ఎక్కిన తరువాతే డిమాండ్‌ చేస్తారు. వర్ధమాన నటి ఐశ్వర్యమీనన్‌ది ఇదే తంతు. ఇంతకు ముందు కాదలిల్‌ సొదప్పవదు ఎప్పడి, తీయ వేలై చేయనుమ్‌ కుమారు చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన ఈ అమ్మడు ప్రస్తుతం వీర చిత్రంలో నటుడు కృష్ణకు జంటగా కథానాయకిగా ప్రమోషన్‌ అందుకుంది.అంతకు ముందే కన్నడం, మలయాళ భాషల్లో నటిగా పరిచయమైన ఈ మలయాళీ భామ అనువాద చిత్రాల ద్వారా తెలుగుకు పరిచయమైంది.

వీర చిత్రంలో తనది చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర అంటున్న ఐశ్వర్యమీనన్‌ ఆ చిత్రం షూటింగ్‌ పూర్తి కావడంతో స్టార్‌ హీరోలపై కన్నేసింది. ఎవరెవరితో జత కట్టాలన్న దాని గురించి ఒక పట్టికను కూడా రెడీ చేసుకుందట. వారిని టార్గెట్‌ చేసుకుని అవకాశాలను పొందే ప్రయత్నాలు మొదలెట్టిందట. అయితే తన తొలి గురి ఆర్యనే నట. అందుకు కారణం చెబుతూ తాను కాలేజి చదువుకునేటప్పుడే ఆర్యకు వీరాభిమానినని, తనకు నటినవ్వాలన్న కోరికకు ఆయనే కారణం అని చెప్పుకొచ్చింది. ఆర్యతో చిత్రాలు చేస్తున్న దర్శకుల గురించి ఆరా తీసి వారికి అవకాశాలను కోరుతూ రాయబారిని పంపుతోందట. వారికి ఫ్రీ ఆఫర్‌ కూడా ఇచ్చేస్తోందట. ఆర్యతో నటించే అవకాశం కల్పిస్తే పారితోషికం కూడా కోరనని అంటోందట. మరి ఐశ్వర్యమీనన్‌ ఫ్రీ ఆఫర్‌కు ఎవరు రియాక్ట్‌ అవుతారో చూద్దాం.