ఐటెం బ్యూటీ డ్రీమ్ ఏంటో తెలుసా?

0Nora-fatehi-Dreemనోరా ఫతేహిని టాలీవుడ్ జనాలకు ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. టెంపర్.. బాహుబలి.. కిక్ 2.. షేర్.. లోఫర్.. ఊపిరి.. ఇలా వరుసగా తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసేసి.. తెలుగు ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించేసుకుంది. అయితే.. ఎంత స్పీడ్ గా అన్నేసి సినిమాలు చేసిందో.. ఇప్పుడు కొత్త సినిమాల విషయంలో అంతగా అలర్ట్ గా ఉంది.

‘తెలుగులో చేసిన ఈ పాటలు నన్ను బిగ్ బాస్.. ఝలక్ దిఖ్ లాజా వంటి గేమ్ షోల వైపు నడిపించాయి. తెలుగు సినిమాల కారణంగానే ఇది సాధ్యమైంది. కానీ ఇప్పుడు కొత్త సినిమాలకు సైన్ చేయడంపై చాలానే ఆలోచిస్తున్నాను. అవకాశాలు వస్తూనే ఉన్నా.. వాటిలో ఎక్కువ డ్యాన్సర్ గా మాత్రమే ఉంటున్నాయి. కానీ డ్యాన్సర్ కంటే ముందు నేను నటిని. అందుకే యాక్ట్రెస్ గా ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నా’ అని చెప్పింది నోరా ఫతేహి.

‘నేను కేవలం డ్యాన్స్ మాత్రమే కాదు.. సినిమాల్లో అంతకంటే ఎక్కువగానే చేయగలను. ఇప్పుడు నేను చేయబోయే పాత్రల్లో నా యాక్టింగ్ స్కిల్స్ బయటపడేలా ఉండాలని కోరుకుంటున్నా. అలాంటి పాత్రల కోసమే ఎదురుచూస్తున్నా. 2017లో నా డ్రీమ్ నెరవేరడం ఖాయం’ అంటోంది ఐటెం బ్యూటీ నోరా ఫతేహి.