డ్రగ్స్ కేసులో కీలక పాయింట్ చెప్పిన రానా!

0Ranaటాలీవుడ్ ఊపేస్తున్న డ్రగ్స్ వివాదంపై వరుసగా సినీప్రముఖులు స్పందిస్తున్నారు. సినీనటులు ఎక్కడకు వెళ్లినా వారికి మీడియా నుంచి డ్రగ్స్ పై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా ఆరడుగుల ఆజానుబాహుడు రానా కూడా డ్రగ్స్ వివాదంపై తన అభిప్రాయాన్ని తెలియజేసాడు. ఇటీవల చెన్నై లో జరిగిన నేనే రాజు నేనే మంత్రి ప్రమోషన్ కార్యక్రమంలో డ్రగ్స్ వివాదం పై మాట్లాడాడు.

డ్రగ్స్ కేసులో పలువురు సినీ తరాలపై విచారణ కొనసాగుతోంది. సినీ నటులతో పాటు ఎక్సయిజ్ అధికారులు గుర్తింపు పొందిన హైదరాబాద్ లోని పలు స్కూల్ యజమానులకు కూడా నోటీసులు పంపింది. స్కూల్ పిల్లలు డ్రగ్స్ కి బానిసలుగా మారడం అంత్యంత భయంకరమైన అంశం అని రానా తెలిపాడు. 40 ఎల్లా వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటుంటే ఆవిషయం లో అతడికి అవగాహన ఉంటుంది.. కానీ స్కూల్ పిల్లలు డ్రగ్స్ కి అలవాటు పడితే దాని అనర్థాల గురించి వారికి పూర్తిగా తెలియదు. స్కూల్ పిల్లలు డ్రగ్స్ కు అలవాటు పడడం అనేది భయంకరమైన, దృష్టి సారించాల్సిన ముఖ్యమైన అంశం అని రానా అభిప్రాయ పడ్డాడు.