సాహోకి మూడో బాలీవుడ్ విలన్

0Prabhas-Jackie-Shroff-Villainబాహుబలి లాంటి భారీ హిట్ తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది అనడానికి “సాహో” సాక్ష్యం కాబోతోంది. దాదాపు ఐదేళ్లు బాహుబలి కోసం కష్టపడ్డ ప్రభాస్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాతో వీలైనంత త్వరగా రాబోతున్నాడు. రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రం షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇక తమిళ్ – హిందీ భాషల్లో కూడా తెరకెక్కుతుండడంతో స్టార్ హోదా కలిగిన నటి నటులను సాహో సినిమాకు సెలక్ట్ చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.

ఇప్పటికే ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన శ్రద్దా కపూర్ ని సెలక్ట్ చేయగా మరో బాలీవుడ్ అగ్ర నటుడిని విలన్ పాత్రలో ఎంచుకున్నాడు దర్శకుడు సుజిత్. ఆయనే జాకీ ష్రోఫ్. ఈ నటుడు ఇంతకుముందు కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించి ఆకట్టుకున్నారు. అయితే రీసెంట్ గా దర్శకుడు సుజిత్ సాహో సినిమా కథ చెప్పగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఒకే చేశాడట జాకీ ష్రోఫ్. బాహుబలి లాంటి హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ.. ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్థాయిలో హీరో అయ్యాడని ఆయన కామెంట్ చేశారు

.

అయితే ఈ సినిమాలో ఇప్పటికే ఇద్దరు ఫెమస్ విలన్స్ నటిస్తున్నారు. హీరో నీల్ నితిన్ ముకేష్.. మరియు చుంకే పాండే ఆల్రెడీ విలన్స్ గా నటిస్తున్నారు. వారితో పాటు జాకీ ష్రోఫ్ కూడా ఉండడంతో సినిమాకి బాలీవుడ్ లో కూడా భారీ స్థాయిలో క్రేజ్ రావడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక ఈ సినిమా ఇప్పుడిపుడే శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటోంది. దాదాపు 150 కోట్లతో యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.