ఆ సోయగం హాలీవుడ్ వెళుతోందోచ్

0బాలీవుడ్ భామలు హాలీవుడ్ లో అడుగులు వేయడం కొత్తేమీ కాదు. బాలీవుడ్ లో టాప్ రేంజ్ లో వెలుగుతున్న సుందరాంగులు అడపాదడపా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా అయితే ప్రియాంక చోప్రా అక్కడకు వెళ్లి పాతుకుపోయింది. దీపికా పదుకొనే కూడా ఓ బాలీవుడ్ మూవీలో నటించింది. ఇప్పుడు మరో బాలీవుడ్ భామ కూడా హాలీవుడ్ బాట పట్టేసింది.

శ్రీలంక నుంచి వచ్చి ఇండియాలో టాప్ రేంజ్ బ్యూటీగా వెలుగుతున్న సెక్సీ సోయగం జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఇప్పటికే ఓ హాలీవుడ్ మూవీకి సైన్ చేయడమే కాదు.. షూటింగ్ పూర్తి చేసేసింది కూడా. జేమ్స్ సింప్సన్ దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ మూవీ.. ‘డెఫినిషన్ ఆఫ్ ఫియర్’ ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది చాకీ. సరదాగా హాలిడే ట్రిప్ కోసం జనాలకు దూరంగా ఉండే ఓ మాన్షన్ కు వెళ్లే నలుగురు స్నేహితుల కథే ఈ సినిమా. అక్కడ ఔజా బోర్డ్ ను కనుగొన్న వీరు.. ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారనే థీమ్ ను.. భయానకంగా చూపించబోతున్నారు.

హారర్ కం సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని.. అధిక భాగం కెనడాలోనే షూట్ చేస్తున్నారు. కేథరిన్ బారెల్.. బ్లిత్ హబ్బర్డ్.. మెర్సిడస్ పపాలియా ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఫార్ములా బాలీవుడ్ ఇండియా నిర్మించిన ఈ చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్ చేయనుండగా.. ఇప్పటికే విడుదల అయిన ప్రమోషనల్ మెటీరియల్ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది.