కావ్య చాలా హాటు గురూ

0ఇప్పుడు బాలీవుడ్ ను మరోసారి టెంప్ట్ చేస్తోంది శ్రీలంకన్ బ్యూటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. అమ్మడు ఎప్పటికప్పుడు అక్కడ తన సెక్సీ లుక్స్ తో రచ్చ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు తన రాబోయే కొత్త సినిమా ‘ఏ జెంటిల్మన్’తో ఇంకా పీక్స్ లో తన గ్లామరసం దారబోయనుంది ఇప్పుడు ఆ సినిమా ఫోటోలు చెప్పకనే చెబుతున్నాయి.

సిద్దార్ధ్ మల్హోత్రా హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో.. కావ్య అనే ఒక క్షణికావేశం ఉన్న రోల్ ను చేస్తోంది జాకీ. అయితే ఈ పాత్ర కోసం అమ్మడు చాలా అల్ట్రా మోడ్రన్ గా కనపడనుంది. చూస్తుంటే తెలుస్తోందిగా.. అమ్మడి హాట్నెస్ లెవెల్ ఎలా ఉండబోతుందో. బికినీ బ్రా ఒకటి వేసుకుని.. ఇక్కడ ఒక పాట కోసం తన అందాలను ఎలా అదరగొట్టించిందో కనిపిస్తోందిగా. కళ్ళకు కళ్ళద్దాలు పెట్టుకోవాల్సింది జాక్వెలిన్ కాదు.. మనం.. అంతే కదూ? ఇకపోతే ఈ సినిమాలో ఇలాంటి గ్లామర్ కంటే కూడా ఆమె హీరోకు పెట్టిన లిప్ లాకులే చాలా హాటుగా ఉంటాయట. వాటితో అమ్మడు పెద్ద రచ్చే చేసిందని అంటున్నారు.

ఇక బాలీవుడ్ టాక్ ఏంటంటే.. మొన్ననే సిద్దార్ద్ మల్హోత్రా సినిమాలో కత్రినా కైఫ్ కూడా ఇంతకంటే హాటుగా నటించింది. బికినీల్లోనూ రచ్చ చేసింది. అసలు హీరోయిన్లు అంత ఎక్సపోజింగ్ చేసినప్పుడల్లా సిద్దార్ధ్ కు ఫ్లాపులే వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఇతగాడి నార్త్ ఇండియా ఫ్యాన్స్ కంగారుపడుతున్నారట. అది సంగతి.Jacqueline-Fernandez-in-Gentle-Man-Movie