కుంపటి పెట్టిన కన్నె పిల్ల

0కన్నె పిల్ల కుంపటి పెట్టింది! వేడెక్కించే అందాలతో యువతరం గుండెల్ని చిదిమేసింది. మనసు పడిన వారికి మనసుపడినంతా! విపరీతమైన ఎక్స్ పోజింగ్ లేకుండానే చిన్నపాటి ట్రిక్కు – టాక్టిక్స్ తోనే ఈ అమ్మడు కవ్విస్తున్న తీరు మామూలుగా లేదు. వాలు చూపులతోనే గాలం వేస్తూ.. అలా కొంటెగా నిలబడిన తీరు కుర్రకారును నిలవనీయడం లేదంటే నమ్మండి. ఇంతకీ ఈ అందగత్తె ఎవరో ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనేలేదు. శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్.

కింగ్ ఫిషర్ మోడల్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టాక ఈ భామ సినిమాలతో కంటే ఎఫైర్లతోనే బాగా పాపులరైంది. అప్పట్లో దర్శకుడు సాజిద్ ఖాన్ తో ఎఫైర్ సాగిస్తూ వాడి వేడిగా చర్చల్లోకొచ్చింది. అటుపై బహ్రెయిన్ ప్రిన్స్ షేక్ హసన్ బిన్ రషీద్ అల్ ఖలీఫాతోనూ జోరైన డేటింగ్ తో వేడెక్కించింది. అయితే జాక్విలిన్ కెరీర్ పరంగా వెనకబాటులో ఉన్నప్పుడు సల్మాన్ భాయ్ తనను అన్ని రకాలా ఆదుకున్నాడు. అతడు కిక్ 2లో ఛాన్సివ్వడంతోనే జాక్విలిన్ కెరీర్ గాడిలోకి వచ్చింది. ఆ తర్వాత సల్మాన్ రిఫరెన్సుతోనే `జుడ్వా 2`లో కుర్ర ధావన్ సరసన అవకాశం అందుకుంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక జాక్విలిన్ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం మరోసారి సల్మాన్ భాయ్ సరసన `రేస్3`లో నటిస్తోంది. ఊపిరి సలపనంత ఉక్కిరిబిక్కిరయిపోతోందిప్పుడు. రేస్ 3లో జాక్విలిన్ అల్ట్రా మోడ్రన్ లుక్ రిలీజై ఇదివరకూ సెగలు పుట్టించింది.

మళ్లీ ఇదిగో చాలా కాలానికి ట్రెడిషనల్ గానూ బ్రైడల్ లుక్ లో దర్శనమిచ్చిందిలా. ఈ డిజైన్ లో జాక్విలిన్ ఎంత సింపుల్గా కనిపిస్తోందో అంతే హాట్ అప్పీల్ ఎలివేట్ అవుతోంది. అసల్ లెహెంగా – అబూ జానీ- సందీప్ ఖోస్లా డిజైనర్ డ్రెస్ – జైపూర్ కడాస్ ఆభరణాలతో జాక్విలిన్ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. `బ్రైడల్ ఆసియా` 20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఎడిషన్ కవర్ పేజీపై జాక్విలిన్ ఇలా తళుక్కుమంది.