హీరోయిన్ కన్నుకు పర్మినెంట్ గాయం

0శ్రీలంకకు చెందిన హాట్ బ్యూటీపై జాక్విలిన్ ఫెర్నాండేజ్ కు ప్రస్తుతం ఇండియాలో అభిమానుల సంఖ్య పెరుగుతోంది. గూగుల్ లో సెర్చ్ చేసేవరకు అమ్మడు ఓ విదేశీరాయులు అని ఎవరికీ తెలియదు అంటే ఎంతగా ఇక్కడి వారికి దగ్గరైందో అర్ధం చేసుకోవచ్చు. రోజు రోజుకి ఫ్యాన్స్ ఎంత పెరుగుతున్నప్పటికీ ఈ బ్యూటీ మొదట్లో వచ్చినప్పుడు ఎలా ఉందొ ఇప్పుడు కూడా అలానే ఉంది.

ఇకపోతే తనకు సంబందించిన సంతోషమైన వార్తలను అమ్మడు ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం ఆమె రీసెంట్ గా చెప్పిన ఒక విషయం మాత్రం అభిమానులను కలచివేసింది. తన చూపు విషయంలో ఇబ్బంది ఉన్నట్లుగా ఫోటో ద్వారా తెలియజేసింది. అయితే ఎదో గాయం అనుకుంటే పొరపాటే. జీవితాంతం కూడా తన కన్ను ఆ ఇబ్బందిని ఎదుర్కోక తప్పదు అన్నట్లు వివరించారు.

తన కన్ను షేప్ కూడా మారిందని జాక్విలిన్ తెలియజేసింది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీకి ఆఫర్స్ చాలా వస్తున్నాయి.కెరీర్ మొదలైన 2009 నుంచి ఈ శ్రీలంకన్ ముద్దుగుమ్మ ఏ ఇయర్ ఖాళీగా లేదు. ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో రేస్ 3 ఒకటి. జూన్ 15న ఆ సినిమా విడుదల కానుంది.