చంద్రబాబు చచ్చిపోవాలి అంటూ వ్యాఖ్యలు చేసి, మరోసారి తన ఫ్యాక్షన్ బుద్ధి బయటపెట్టాడు…

0ఆశించింది దక్కనప్పుడు….. ఆడపిల్లల మీద ఆసిడ్ దాడి చెయ్యటం…. కత్తులు పెట్టి పొడవటం… తల్లితండ్రులని కొట్టటం…. స్నేహితుల మీద దాడులు చెయ్యటం….. పెద్దా చిన్నా లేకుండా నోటికొచ్చినట్టు వాగడం… ఇవన్నీ సైకో లక్షణాలు…. రాజుల్ని చంపి రాజ్యాలు ఆక్రమించుకోవటానికి మనమింకా రాచరికంలో లేము…ఎవరైనా ప్రత్యర్ధులను ఓడించమని పిలుపు ఇస్తారు, కేవలం వ్యక్తిగత పగ, ద్వేషం ఉన్నవారే ప్రత్యర్ధులను చంపమంటారు. ఎంత క్రూరమైన మనస్తత్వం ఉంటే ఇలాంటి మాటలు వస్తాయి ?? మనది ప్రజాస్వామ్యం , ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికలు యుద్దంలా జరగవచ్చు, కానీ అది సైద్దాంతికంగానే తప్ప ఒకరినొకరు చంపుకోవటానికి కాదు, ప్రత్యర్ధిని చంపమని బహిరంగంగా పిలుపు ఇచ్చేవారిది ఎలాంటి మనస్తత్వం అయ్యుండాలి ??

ఇది కేవలం ఫాక్షన్ మనస్తత్వాలు, మనిషి ప్రాణమంటే లెక్కలేని రాక్షస మనస్తత్వాలకు మాత్రమే సాధ్యం, మాములు రాజకీయనాయకుల వల్ల కాని పని. ఇలాంటి దుర్మార్గులు మన పాలకులు అయితే ప్రజల పరిస్థితి ఏంటి ?? అలాంటి వాడే మన రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు… జగన్ మోహన్ రెడ్డి మరో సారి, తన ఫాక్షన్ మెంటాలిటీ బయట పెట్టాడు… కాల్చి పారేస్తా… నరుకుతా.. ఉరి వేస్తా… అంటూ చంద్రబాబు పై వ్యాఖ్యలు చేసిన జగన్, ఈ రోజు చంద్రబాబు ఏదన్నా బావిలో దూకి చస్తే, రాష్ట్రానికి పట్టిన శని వదులుతుంది అంటూ, వ్యాఖ్యలు చేసి, మరోసారి తాను ఎంతటి రక్త పిపాసిని అనేది నిరుపించుకున్నాడు…

తన ఫాక్షన్ మెంటాలిటీతో, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని మంగళి కృష్ణా, సూరి, భాను లాంటి వారి చేత, ఎలాంటి మారణ హోమం చేపించాడో చూసాం.. ఇలాంటి రక్త పిపాసి, ఈ రోజు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చచ్చిపోవాలి అంటూ వ్యాఖ్యలు చేసి, తన అసలు నైజం, రంగు బయట పెట్టాడు… ప్రజల అభిమానం పొంది, ఎన్నికల్లో గెలవాలి అనుకోవాలి కాని, ఒక మనిషి చచ్చిపోతే కాని, తాను ముఖ్యమంత్రి అవ్వలేను అని, అనుకుంటున్నాడు… అందుకే, ఇలాంటి సైకో మాటలు… హోదా ఇవ్వాల్సిన ప్రధాని మోడీ అనే పేరు కూడా తలవకుండా, పోరాడుతున్న చంద్రబాబుని చచ్చిపోవాలి అంటున్న ఈ సైకో గురించి ప్రజలే తెలుసుకోవాలి… Source: Amaravathivoice